Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి గొల్లపూడి తెలుగుదేశం కార్యాలయంలో

గొల్లపూడిలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి.

గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి.

విజయవాడ రూరల్, అక్టోబర్ 2:

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సహనం, సామాజిక సమానత్వం వంటి విలువలను గాంధీజీ దేశానికి అందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి అందిస్తూ, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో పయనించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎ.ఎం.సి. చైర్మన్ నర్రా వాసు, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మందా మురళి, టీడీపీ నాయకులు నుతులపాటి నారద, కాటంనేని పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *