తిరుపతి ఆగస్ట్ 17, పున్నమి ప్రతినిధి
జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే తనయుడు ఆరణి మదన్ మోహన్ పుట్టినరోజు వేడుక లను తిరుపతిలో సోమవారం జనశ్రేణులు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో కొందరు దేవాలయాలలో పూజా కార్యక్రమా లు నిర్వహించగా మరికొందరు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, మొక్కల పంపిణీ లు చేసారు, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆ లరణి మదన్ మోహన్ 40 అడుగుల కటౌట్ ను నిర్మించి అక్కడ పెద్ద ఎత్తున కేకును కట్ చేసి బర్తడే సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా మదన్ మోహన్ మాట్లాడు తూ నాపై ఇంతటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్న నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, సునీల్ చక్రవర్తి, హరీష్, సానే శ్రీనివాసులు, సుమన్ బాబు, సుమంత్, సుధాకర్, పవన్, బాలు, ఆది, మంజు, కోలా శ్రీనివాసులు, కుమార్, ఈశ్వర్, చంద్ర, వెంకటేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


