కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్):
తుఫాను ప్రభావంతో వరద ముంపునకు గురైన కాకినాడ నగరం 25వ వార్డు పరిధిలోని భాను వారి వీధిలో శనివారం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ప్రత్యేక చొరవ తీసుకుని మున్సిపల్ కమిషనర్,నగర హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.
భారీ వర్షాలు, వరద ముంపు నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిబిరంలో స్థానికులకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, సిరప్లను అందజేశారు.
ముంపు ప్రాంత ప్రజల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి తక్షణమే స్పందించి శిబిరాన్ని ఏర్పాటు చేయించినందుకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 25వ వార్డు టీడీపీ నాయకుడు కామాడి దశరథుడు మాట్లాడుతూ, ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేకు, నిరంతరం సేవలందిస్తున్న మున్సిపల్ అధికారులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
*వరద ముంపు ప్రాంతంలో మెగా వైద్య శిబిరం* : *ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చొరవ*