Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

గాంధీ, శాస్త్రి ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి చూపిన సత్యం, అహింస, నైతికత, దేశభక్తి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటి బోస్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి, హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గాంధీజీ సత్యం, అహింస, సామాజిక సమానత్వం, స్వచ్ఛత వంటి విలువలను సమాజానికి అందించారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ నినాదంతో సైనికులు, రైతుల సేవలను గౌరవించిన లాల్‌బహదూర్‌ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వారి ఆశయాలను ఆచరణలో పెట్టి సేవాభావాన్ని పెంపొందించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *