అనంతసాగరం అక్టోబర్ 03,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం:
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని,అలాగే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విబిజీ రాం జీ స్కీమ్‌ను రద్దు చేసి, పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్వర్ బాషా డిమాండ్ చేశారు.
శనివారం అనంతసాగరం మండల కేంద్రంలోని తాజ్ కేఫ్ వద్ద సిపిఎం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, వీబిజి రామ్ జీ స్కీమ్ రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టం అమలు
చేయాలని కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్వర్ బాషా మాట్లాడుతూ
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. సర్ పేరుతో దేశంలో ఉండే 13 కోట్ల మంది ప్రజల ఓటు హక్కును తన ఏకపక్ష నిర్ణయంతో తొలిగించడం జరిగిందని అన్నారు. ఓటు కోల్పోయిన వారందరికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడాలని స్పష్టం చేశారు. అలాగే పేద ప్రజలకు ఉపాధి పనులులేకుండా చేసే కొత్త విబిజీ రామ్ జీ స్కీమ్ రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటి సభ్యులు వేము పెంచలయ్య, గాడి సుధాకర్, ఉప్పలపాడు మస్తాన్, రాటకొండా పెంచల నాయుడు, వెంకటేష్ మరియు స్థానిక ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు.
