ఉదయగిరి కోపరేటివ్ బ్యాంకు ద్వారా రైతులకు క్రాప్ లోన్లు, హౌసింగ్ లోన్లు, హౌస్ మార్టిగేజ్ లోన్లతో పాటు పలు రకాల రుణ సదుపాయాలు అందిస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మండలంలోని రైతులు సొసైటీల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించి, తిరిగి రుణ సదుపాయాన్ని పొందాలని సూచించారు. ఇప్పటికే ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు బీఎం ఎం. నాగరాజు, సీఈవో పోలయ్య, సూపర్వైజర్ టీవీ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఉదయగిరి : కోపరేటివ్ బ్యాంకు ద్వారా పలు రకాల రుణాలు