ఉదయగిరి మండలంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా VB-RAM-G పథకం కింద 32 రోడ్ల నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంజూరైన నిధులతో సంబంధిత రోడ్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఉదయగిరి మండలంలో 32 రోడ్లకు రూ.2.50 కోట్లు