Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల రవాణా కష్టాలకు మంత్రి ఆనం తక్షణ స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యార్థుల రవాణా కష్టాలకు మంత్రి ఆనం తక్షణ స్పందన

వార్త ముఖ్యాంశాలు

  • చేజర్ల: మండలంలోని గొల్లపల్లిలో గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విద్యార్థులు తమ రవాణా సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
  • పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.

చేజర్ల: మండలంలోని గొల్లపల్లిలో గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విద్యార్థులు తమ రవాణా సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, అప్పటివరకు విద్యార్థుల రాకపోకలకు బ్యాటరీ ఆటో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత చర్యలు ప్రారంభించారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించిన మంత్రి నిర్ణయంపై గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *