కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్):
*కాపు సద్భావన సంఘం* జిల్లా అధ్యక్షుడు ముమ్మిడి వెంకట వీర సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం *శుభం కాపు కళ్యాణ మండపంలో* ఈ మధ్యకాలంలో స్వర్గస్తులైన *కంచర్ల గోపాలకృష్ణ, రావిపాటి సత్యానందం, బుర్రి కొండరాజు, గాళ్ళ సుబ్రహ్మణ్యం, సాన వీర రాఘవరావు, సవ్వాకుల అరుణ,* లకు కాపు సద్భావన సంఘం తరపున నివాళులర్పించారు. అలాగే వీరు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరు బతుకున్న కాలంలో కాపులకు అలాగే వివిధ కులాలలో నిరుపేదలకు అనేక సేవలు అందించారాని వీరిని తర్వాతి తరం వారు ఆదర్శంగా తీసుకొని అందరికీ వెన్నుదన్నుగా నిలవాలని తెలిపారు. *మండల వెంకటకృష్ణారావు* జయంతిని కూడా నిర్వహించారు. అనంతరం,కార్తీక వన సమాధాన ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన కూడా వారు చర్చించారు త్వరలోనే *కాపు వన సమారాధన* పై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బసవ ప్రభాకర్ రావు,చిట్నీడి శ్రీనివాస్,చోడిశెట్టి కాశి, దొడ్డిపట్ల అప్పారావు, నూకల బలరాం,జీవి మూర్తి, జే రంగనాయకులు,టి మురళి శ్రీనివాస్,ఆర్ రాజా,ఎస్వి రమణ,డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
*……..పలువురు కాపు ప్రముఖులకు నివాళులర్పించిన కాపు సద్భావన సంఘం కమిటీ సభ్యులు…..*