Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

అమరావతి ఎకనామిక్ రీజియన్‌ (AER) ప్రణాళికఫై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి, మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అమరావతి ఎకనామిక్ రీజియన్‌ (AER) ప్రణాళికఫై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి, మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

అమరావతి ఎకనామిక్ రీజియన్‌ (AER) ప్రణాళికఫై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి, మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

మార్కాపురం జిల్లాను అమరావతి ఎకనామిక్ రీజియన్‌ పరిధిలో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.
మార్కాపురం కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఏఈఆర్‌ వర్క్‌షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలోని సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమలు, పర్యాటక రంగాల్లోని అవకాశాలను గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

మౌలిక వసతులు, రహదారులు, రవాణా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, తాగునీరు, పట్టణ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా, రాబోయే సంవత్సరాల్లో జిల్లాకు ప్రయోజనం కలిగేలా దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాను హార్టికల్చర్ హబ్‌లో చేర్చడం ఒక వరమని, దానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సీఆర్‌డీఏ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *