ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌లో డ్రైనేజీపై కొన్నేళ్లుగా కొందరు ఆక్రమణలు చేసి వ్యాపార గదులు, నివాస నిర్మాణాలు చేపట్టారు. తాజాగా బస్టాండ్ మరుగుదొడ్లకు ఆనుకుని ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మించిన కట్టడాలను తొలగించి, ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం జరగడంతో పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. అనంతరం ఆక్రమణకు అవకాశం లేకుండా అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజీలు, ప్రజా వినియోగ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆక్రమణలకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో స్థానికులు అధికారుల చర్యలను అభినందించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
స్థల ఆక్రమణను అడ్డుకున్న పంచాయతీ అధికారులు