Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: కూచాడి శ్రీహరిరావు

నిర్మల్: గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ఐక్యత సిద్ధాంతాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల బాటలో నడవాలని శ్రీహరిరావు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్ జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *