Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వీబీ–జీ–రామ్–జీ కూలీలను ఘనంగా సన్మానించిన సర్పంచ్ గొంది సుజాత–నాగేశ్వరరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వీబీ–జీ–రామ్–జీ కూలీలను ఘనంగా సన్మానించిన సర్పంచ్ గొంది సుజాత–నాగేశ్వరరావు

మంగళవారిపేట గ్రామ పంచాయతీలో వీబీ–జీ–రామ్–జీ పథకంలో అత్యధిక పని దినాలు పూర్తి చేసిన ముగ్గురు కూలీలను సర్పంచ్ గొంది సుజాత–నాగేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
మంగళవారిపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో భాగంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీ ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూషబోయిన రాజు, పంచాయతీ కార్యదర్శి యుగంధర్, వార్డు సభ్యులు గొంది నరసయ్య, చెన్నబోయిన భాగ్య, తాళ్లపల్లి కవిత కమలాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ పులిగిల్ల శ్రీశైలంతో పాటు గ్రామ పెద్దలు రాగం ఐలయ్య, సైదులు, ననబోయిన రమేష్, నిరటి రాములు, సదయ్య, శిరీష, స్వప్న, బులమ్మ, గంగా, నాగమ్మ తదితరులు, కూలీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *