Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*కత్తిపూడి జడ్పీ హైస్కూల్ ను ఆకస్మికం గా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్..*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):

కత్తిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్.. అసిస్టెంట్ కలెక్టర్ ప్రియతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం నాణ్యత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి,అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.రిజిస్టర్లు తనిఖీ చేసి వివరాలు ఆరా తీశారు. పాఠశాలలోని తొమ్మిది,పదవ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ నేరుగా ముచ్చటించి, వారి విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.విద్యార్థులు చదువులో రాణించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని క్రమం తప్పకుండా విద్యార్థులను ఇప్పటి నుంచే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.పదోతరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని అత్యధికంగా సాధించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన మిషన్-2027 కార్యక్రమాన్ని పాఠశాలలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఉపాధ్యాయులందరూ తరగతి గదిలో ప్రతి విద్యార్థి పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని మెనూ ప్రకారం నాణ్యతతో రుచికరంగా విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ సందర్భంగా సూచించారు.ఈ పర్యటన లో జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.వీ.వీ.సత్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *