Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ఏపీ మోడల్ స్కూల్ SMC చైర్మన్‌గా మాల్యాద్రి, వైస్ చైర్మన్‌గా స్రవంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*ఏపీ మోడల్ స్కూల్ SMC చైర్మన్‌గా మాల్యాద్రి, వైస్ చైర్మన్‌గా స్రవంతి

కొండాపురం ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. SMC చైర్మన్‌గా జి. మాల్యాద్రి, వైస్ చైర్మన్‌గా ఎం. స్రవంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.కే. వేంకట ఖాదర్ బాషా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలోనూ, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడంలో SMC పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థుల విద్యా ప్రగతికి, పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

*ఏపీ మోడల్ స్కూల్ SMC చైర్మన్‌గా మాల్యాద్రి, వైస్ చైర్మన్‌గా స్రవంతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *