Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

మంథని: మైత్రి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంథని: మైత్రి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్

వార్త ముఖ్యాంశాలు

  • మంథని, అక్టోబర్ 01: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి తీరంలో గురువారం మైత్రి ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.
  • ఈ ఎన్నికల్లో ఆటో యూనియన్ అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.అధ్యక్ష పదవికి 'గుర్రం' గుర్తుపై గడిపెల్లి శ్రీనివాస్, 'ఉంగరం' గుర్తుపై ఎండి ఎజాజ్ పోటీపడ్డారు.
  • యూనియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో మొత్తం 237 ఓట్లు పోలయ్యాయి.

మంథని, అక్టోబర్ 01:

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి తీరంలో గురువారం మైత్రి ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆటో యూనియన్ అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.అధ్యక్ష పదవికి ‘గుర్రం’ గుర్తుపై గడిపెల్లి శ్రీనివాస్, ‘ఉంగరం’ గుర్తుపై ఎండి ఎజాజ్ పోటీపడ్డారు. యూనియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో మొత్తం 237 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో గడిపెల్లి శ్రీనివాస్‌కు 146 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి ఎండి ఎజాజ్‌కు 91 ఓట్లు పోలయ్యాయి. దీంతో తన ప్రత్యర్థిపై శ్రీనివాస్ 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఈ ఎన్నికల ప్రక్రియకు ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ఎస్.కె. సలీం, బడికెల శ్యామ్, ఎండి. అక్రమ్ వ్యవహరించగా, ఎలక్షన్ ఏజెంట్లుగా మంథని అశోక్, పోలు కనకరాజులు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, యూనియన్ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *