Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

తణుకులో రాజు ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భక్తి సంగీత గానామృతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తణుకులో రాజు ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భక్తి సంగీత గానామృతం

వార్త ముఖ్యాంశాలు

  • తణుకు, సెప్టెంబర్ 30, 2026 : గానగంధర్వుడు పద్మవిభూషణ్ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని రాజు ఆర్కెస్ట్రా నిర్వాహకులు ఆకుమర్తి రాజు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక డా.ఈతకోట లక్ష్మీదేవి లయన్స్ కమ్యూనిటీ హాలులో "భక్తి సంగీత గానామృతం" అనే పాటల కార్యక్రమం ఘనంగా జరిగింది.* తణుకు సజ్జాపురం…
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్, లయన్స్ జీ ఏ డీ కోఆర్డినేటర్ శ్రీమతి వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, తన భర్త వావిలాల రమేష్ సహకారంతో తణుకులో కీర్తి శేషులు, అమర గాయకులు పద్మశ్రీ వెంకటేశ్వరరావు విగ్రహం ఏర్పాటు చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.
  • ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.

తణుకు, సెప్టెంబర్ 30, 2026 : గానగంధర్వుడు పద్మవిభూషణ్ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని రాజు ఆర్కెస్ట్రా నిర్వాహకులు ఆకుమర్తి రాజు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక డా.ఈతకోట లక్ష్మీదేవి లయన్స్ కమ్యూనిటీ హాలులో “భక్తి సంగీత గానామృతం” అనే పాటల కార్యక్రమం ఘనంగా జరిగింది.*
తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు అడ్డగర్ల వెంకటేశ్వరరావు మరియు సభ్యుల ప్రోత్సాహంతో రాజు ఆర్కెస్ట్రా నిర్వహించిన ఈ సంగీత విభావరిలో తొలుత పలువురు ప్రముఖులు అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, గాన గంధర్వుడు పద్మవిభూషణ్ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ల చిత్రపటాలకు పుష్పమాలలు అలంకరించి పుష్పాంజలి ఘటించారు.*

*ఈ సందర్భంగా లయన్స్ సీనియర్ సభ్యులు హోటల్ శ్రీదేవి యజమాని బైలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఘంటసాల మరియు బాలు పాడిన పాటలు మనోరంజకంగా, మనస్సుకు ఆనందాన్ని కలుగజేస్తాయని కొనియాడారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్, లయన్స్ జీ ఏ డీ కోఆర్డినేటర్ శ్రీమతి వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, తన భర్త వావిలాల రమేష్ సహకారంతో తణుకులో కీర్తి శేషులు, అమర గాయకులు పద్మశ్రీ వెంకటేశ్వరరావు విగ్రహం ఏర్పాటు చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి. బాలు లకు మరణం లేదనీ, వారు అమర గాయకులనీ, వారు పాడిన పాటలు మన హృదయాలను ఎప్పుడూ రంజింపజేస్తూ ఉంటాయని చెప్పారు.*

*ఉల్లాసభరిత వాతావరణంలో జరిగిన ఈ “భక్తి సంగీత విభావరి” లో గాయనీ గాయకులు ఆకుమర్తి రాజు, చిప్పాడ నాగేశ్వరరావు, ఎస్.దొరబాబు, ఎమ్.శ్రీనివాస్, పి.ధనలక్ష్మి, పప్పొప్పు విజయలక్ష్మి ఎస్. శ్రీదేవి, ఆర్.రామకృష్ణ ప్రభృతులు వివిధ పాటలు గానం చేయగా, శ్రీమతి వావిలాల సరళాదేవి పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భక్తి సంగీత గానామృతం ఆహుతులను, సంగీత ప్రియుల హృదయాలను రజింపజేసింది.*

*ఈ సంగీత విభావరి కార్యక్రమంలో సజ్జాపురం లయన్స్ క్లబ్ నాయకులు, సభ్యులు, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్, సినీ కథా రచయిత కె. జె.ఎస్. రామారెడ్డి (సితారె), సినీ గేయ రచయిత్రి శ్రీమతి పప్పొప్పు విజయలక్ష్మి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి అర్జి భాస్కర రావు, ది భీమవరం ఆర్కెస్ట్రా అసోసియేషన్ అధ్యక్షులు కన్నబాబు మరియు డిసిప్లనరీ కమిటీ పెద్దలు, ఆధ్యాత్మిక గాయకులు పిప్పళ్ళ ప్రసాద్,* *గాయకులు విజయ్,*
పుర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *