నందలూరు మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల కమిటీ చైర్మన్గా చల్లా సురేంద్ర ఎన్నికయ్యారు.
చైర్మన్ పదవికి ప్రసాద్, చల్లా సురేంద్ర పోటీ పడగా, మొత్తం 21 ఓట్లకు గాను సురేంద్రకు 16 ఓట్లు లభించాయి. దీంతో ఆయన చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు పెద్దలు, నాయకులు, శ్రేయోభిలాషులు చల్లా సురేంద్రను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేకంగా కృషి చేస్తానని సురేంద్ర పేర్కొన్నారు.