Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

నేడు అత్యంత పవిత్రమైన అంగారక చతుర్థి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు అత్యంత పవిత్రమైన అంగారక చతుర్థి

వార్త ముఖ్యాంశాలు

  • మంథని రూరల్,సెప్టెంబర్ 28: భాద్రపద మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు.
  • మంగళవారం చతుర్థి తిథి రావడంతో ఈ రోజును అంగారక చతుర్థిగా పిలుస్తారు.
  • శ్రీ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్ష చేపడితే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం అంగారక చతుర్థి రావడం విశేషంగా భావిస్తున్నారు.

మంథని రూరల్,సెప్టెంబర్ 28:

భాద్రపద మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు. మంగళవారం చతుర్థి తిథి రావడంతో ఈ రోజును అంగారక చతుర్థిగా పిలుస్తారు. శ్రీ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్ష చేపడితే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం అంగారక చతుర్థి రావడం విశేషంగా భావిస్తున్నారు. ఈ రోజున కొత్తగా గణపతి దీక్ష చేపట్టడంతో పాటు ఇప్పటికే దీక్షలో ఉన్న వారు ఉద్యాపన చేసుకోవడం శుభప్రదమని పండితులు పేర్కొంటారు.
అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వరుడిని ప్రత్యేకంగా పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే గణనాథుని కరుణాకటాక్షాలతో అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుదీరిన గణనాథుడికి అంగారక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రతి నెల పౌర్ణమి అనంతరం వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టి, రాత్రి చంద్రోదయం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున గణనాథుడిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *