Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై బోలా హర్షం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మనుబోలు (పున్నమి విలేఖరి) 2, ఫిబ్రవరి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు .
  • ఈ బడ్జెట్ వల్ల దేశంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోందని నూతన దశాబ్దంలో ఆర్థికమంత్రి నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్​ భారత విశ్వాసాన్ని పెంపొందించుతుంది.
  • ఈ ఆశాజనక, ప్రగతిశీల బడ్జెట్​ వల్ల రానున్న కాలంలో భారత్ ఎంతో ఆరోగ్యవంతంగా, సంపన్న దేశంగా మారుతుంది అని అన్నారు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు వల్ల పన్ను చెల్లింపు దారులకు అసాధారణ రీతిలో ఉపశమనం కలుగుతుందని అన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం సంకల్పానికి…


మనుబోలు (పున్నమి విలేఖరి) 2, ఫిబ్రవరి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు . ఈ బడ్జెట్ వల్ల దేశంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోందని నూతన దశాబ్దంలో ఆర్థికమంత్రి నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్​ భారత విశ్వాసాన్ని పెంపొందించుతుంది. ఈ ఆశాజనక, ప్రగతిశీల బడ్జెట్​ వల్ల రానున్న కాలంలో భారత్ ఎంతో ఆరోగ్యవంతంగా, సంపన్న దేశంగా మారుతుంది అని అన్నారు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు వల్ల పన్ను చెల్లింపు దారులకు అసాధారణ రీతిలో ఉపశమనం కలుగుతుందని అన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం సంకల్పానికి ఈ బడ్జెట్​ ఎన్నో విధాలుగా దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు.
రైతులు, పేద, మధ్య తరగతి, వ్యాపార వర్గాలు లబ్ధిపొందే విధంగా బడ్జెట్​​ను రూపొందించిన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు నా అభినందనలు. ధాన్యం నిల్వ, నీటిపారుదలలో విధించిన నిబంధనలు.. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పానికి దోహద పడతాయి. మౌలిక వసతులకు ఊతమివ్వడం, సహేతుకమైన పన్ను వ్యవస్థ, సులభతర వాణిజ్యంలో పెట్టుబడులు, బ్యాంకింగ్​ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.
బడ్జెట్​ 2020 చా సమతూకంగా ఉన్నాయని
ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *