Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి.. పిడుగుపాటుకు మూడు మేకలు మృతి – రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి.. పిడుగుపాటుకు మూడు మేకలు మృతి – రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ పట్నం రమేష్ కురుమ
తుర్కయంజాల్: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో మన్నెగూడ కాలనీకి చెందిన గొర్రెల కాపరి కోడూరు జంగయ్యకు చెందిన మూడు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనతో నిరుపేద కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ పట్నం రమేష్ కురుమ ఆవేదన వ్యక్తం చేశారు.
మేకల మందను కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్న జంగయ్య కుటుంబానికి ఈ నష్టం తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పిడుగుపాటుకు మృతి చెందిన మూడు మేకలకు నష్టపరిహారంగా రూ.లక్ష మంజూరు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సంఘటన స్థలాన్ని బీఎస్పీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఉపాధ్యక్షులు వద్దిగల్ల బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షులు ఒర్సు శ్రీనివాస్, భద్రయ్య ముదిరాజ్, బొమ్మరాజు వినోద్, బీఎస్పీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు లపంగి రాజు, బి. రాజ్ కుమార్, వీఆర్వో హనుమంతు, వెటర్నరీ అసిస్టెంట్ ఎర్ర గిరీశ్వర్ తదితరులు పరిశీలించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు.

గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి.. పిడుగుపాటుకు మూడు మేకలు మృతి – రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *