Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం రూ.3.01 లక్షలకు లడ్డూ దక్కించుకున్న గంజి రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం రూ.3.01 లక్షలకు లడ్డూ దక్కించుకున్న గంజి రమేష్

కొత్తపేట: పివిటి మార్కెట్ మర్చంట్ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి.

నిమజ్జన శోభాయాత్రకు ముందు స్వామివారి లడ్డూ, పట్టు వస్త్రాలు, నోట్ల కట్టల వేలం పాట నిర్వహించారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులు, వ్యాపారులు పోటీపడగా గంజి రమేష్ రూ.3,01,000లకు దక్కించుకున్నారు. పట్టు వస్త్రాలు, నోట్ల కట్టను బోసు మాస్టర్ రూ.5,100 చొప్పున వేలంలో దక్కించుకున్నారు.

అనంతరం మంగళవాయిద్యాలు, కోలాటాలు, భక్తుల నృత్యాలు, ‘గణపతి బప్పా మోరియా’ నామస్మరణల మధ్య గణనాథుని శోభాయాత్ర నిర్వహించి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో వ్యాపారులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, మార్కెట్ సుభిక్షంగా వర్ధిల్లాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు, సభ్యులు, స్థానిక వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం రూ.3.01 లక్షలకు లడ్డూ దక్కించుకున్న గంజి రమేష్

కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం రూ.3.01 లక్షలకు లడ్డూ దక్కించుకున్న గంజి రమేష్

కొత్తపేటలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం రూ.3.01 లక్షలకు లడ్డూ దక్కించుకున్న గంజి రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *