నాగోల్: నాగోల్‌లోని సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కళ్ళం వెంకటేశ్వర రెడ్డి, చైర్ పర్సన్ రాజేశ్వరి దంపతుల నేతృత్వంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ ప్రసాదం వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. సంస్థ మార్కెటింగ్ లీడర్ జె. సునీత రూ.8,82,000లకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గణేశుడి ఆశీస్సులతో అందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.
కళ్ళం వెంకటేశ్వర రెడ్డి, రాజేశ్వరి దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై గణనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో సంస్థ అడ్మిన్ అండ్ సీఈఓ, సిబ్బంది, లీడర్లు, మార్కెటింగ్ సహచరులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం గణనాథుని నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు.


