Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి.. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ కురుమ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి.. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ కురుమ

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, ధీరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ కురుమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దొడ్డి కొమురయ్య తెలంగాణ ప్రజల హక్కుల కోసం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో దొడ్డి కొమురయ్యకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన సేవలను భావితరాలకు గుర్తుండేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టడం ద్వారా ఆయన త్యాగాన్ని గౌరవించడంతో పాటు, తెలంగాణ చరిత్రలో ఆయన పాత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు అవుతుందని కుండె వెంకటేష్ కురుమ తెలిపారు.

కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టేలా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి.. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ కురుమ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *