Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గోపాల్ ముదిరాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గోపాల్ ముదిరాజ్

ఎల్బీనగర్: కర్మన్ఘాట్ శుభోదయం కాలనీలో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవ నగర్ కాలనీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపాల్ ముదిరాజ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం చెరువుగట్టు చారి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి పాటల కార్యక్రమాన్ని గోపాల్ ముదిరాజ్ తిలకించారు. అనంతరం భక్తులకు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాలెం చంద్రశేఖర్ గౌడ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, పాలెం సతీష్ గౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, పల్లె శ్రీధర్ గౌడ్, కార్తీక్ ముదిరాజ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కమిటీ సభ్యులు సల్మాన్, మదన్, నవీన్ కుమార్, అవినాష్, మధు, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గోపాల్ ముదిరాజ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *