Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలో శ్రీ మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రామ పెద్దలు పల్లా భాస్కర్‌రెడ్డి–పుల్లమ్మ దంపతుల కుమారులు పల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మధురెడ్డిలను వినాయక విగ్రహ దాతలు, అన్నదాన వితరణ దాతలుగా ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

పల్లా భాస్కర్‌రెడ్డి నివాసం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుని సన్నిధిలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

అనంతరం ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు కార్యక్రమానికి సహకరించిన ముఖ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పల్లా భాస్కర్‌రెడ్డి కుమారులు మాట్లాడుతూ యూత్ సభ్యులు, గ్రామస్థులు సమష్టిగా కలిసిమెలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన భక్తులు, గ్రామస్థులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ఐకమత్యంతో నిర్వహించాలని ఆకాంక్షించారు.

నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *