Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు

వనస్థలిపురం: ప్రశాంత్‌నగర్ కాలనీలో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ స్నేహితులు కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో సందడి నెలకొంది.

ఈ సందర్భంగా రామారావు కేక్ కట్ చేయగా, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్నేహితులు, స్థానికులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామారావును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. అనంతరం పరస్పరం ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రామారావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.

కాలనీ స్నేహితులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రశాంత్‌నగర్ కాలనీ స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు

ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *