Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ఉప్పల్ భగాయత్‌లో ఘనంగా క్రీమాజ్జో కాఫీ షాప్ ప్రారంభం.. నాణ్యమైన సేవలతో వినియోగదారుల ఆదరణ పొందాలి: పరమేశ్వర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉప్పల్ భగాయత్‌లో ఘనంగా క్రీమాజ్జో కాఫీ షాప్ ప్రారంభం.. నాణ్యమైన సేవలతో వినియోగదారుల ఆదరణ పొందాలి: పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భగాయత్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీమాజ్జో కాఫీ షాప్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాఫీ షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీమాజ్జో కాఫీ షాప్ యజమానులు సురేష్, కల్యాణిలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభించిన సంస్థ విజయవంతంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో పూజల వేదవతి, పూజల పవన్, మోహన్, తుమ్మల దేవిరెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొని క్రీమాజ్జో కాఫీ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉప్పల్ భగాయత్‌లో ఘనంగా క్రీమాజ్జో కాఫీ షాప్ ప్రారంభం.. నాణ్యమైన సేవలతో వినియోగదారుల ఆదరణ పొందాలి: పరమేశ్వర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *