ఇబ్రహీంపట్నంలో ముడావత్ వారి పెండ్లి సందడి.
సాయిబాబా–దివ్య వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27: పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ముడావత్ కుటుంబంలో వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది. టీడీపీ కుటుంబ సభ్యులు శ్రీ ముడావత్ శ్రీనివాసరావు, శ్రీమతి వెంకటరమణ దంపతుల కుమారుడు సాయిబాబా వివాహం దివ్యతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరిగింది.
ఈ వివాహ వేడుకకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సాయిబాబా–దివ్య దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందమయంగా సాగాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
