Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఆప్ నేతల ఘన నివాళులు
నిర్మల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ సమీపంలో గల గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్‌పర్సన్ వసంత్ రావు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *