*గోదారి ఉప్పెంగేలా రాజమండ్రిలో నేడు కాంట్రాక్టు ఉద్యోగుల గర్జన!*
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో విస్తృత స్థాయిలో ప్రాంతీయ సదస్సు!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షురాలు దయామణి*
నల్లజర్ల: మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4
నల్లజర్ల తమ హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదివారం రాజమహేంద్రవరం తరలి రానున్నారు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షురాలు దయామణి శనివారం పత్రికల వారికి తెలియజేసారు. అక్టోబర్ 4వ తేదీ ఆదివారం రాజమహేంద్రవరం తాడితోట జంక్షన్ లోని రవణం శ్రీరాములయ్య కళ్యాణమండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా దయామణి మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఆప్కాస్, పార్ట్-టైమ్, డైలీవేజ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారన్నారు. పూర్తి అర్హతలు ఉండి, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వీరికి కనీస వేతనాలు కూడా అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నాలుగో సదస్సు రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉద్యోగులందరూ ఐక్యంగా తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని దయామణి కోరారు.పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.