Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి ఫుల్ జోష్

*ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి ఫుల్ జోష్…*

నార్కెడిమిల్లిలో వైసీపీని వీడి టీడీపీ లో చేరిన 80 కుటుంబాలు

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సత్యానందరావు

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ వచ్చింది. నార్కెడిమిల్లి గ్రామంలో వైసీపీ ని వీడి 80 కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనను మరియి ఎమ్మెల్యే సత్యానందరావు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని, జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి తప్పు చేశామని వారి పార్టీ వారే బహిరంగంగా చెప్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల పైనే కాకుండా పారదర్శంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి 16 వేల మందికి పైగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను జగన్ అవమానించడమే కాక దాడులు కూడా చేయిస్తున్నారని అందుకే జగన్ పద్దతి నచ్చకే పార్టీని వీడినట్లు 80 కుటుంబాలు ప్రకటించారన్నారు. ఇటీవల చేరికల సభ అని పేరవరంలో సమావేశం పెడితే అందులో ప్రశ్నించిన తమ కార్యకర్తనే అవమానించేలా వైసీపీ నాయకుడు మాట్లాడాడని కార్యకర్తకు విలువ ఇవ్వలేని వైసీపీ లో ఉండమని చెప్పారన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి అందునా తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరుగుతుందని అది చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇటీవల మార్పు మొదలైందని అనడం కళ్ల అని అన్నారు. కొత్తపేటలో వైసీపీ పార్టీ అంతమై మార్పు ముగుస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *