Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు MVI కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఆత్మకూరు: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MVI ఎం. రాములు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యం, అహింసా మార్గాల్లో పయనిస్తూ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస, శాంతి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *