తూర్పు గోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం (పున్నమి ప్రతినిధి) గత నెల 28వ తేదీ రాత్రి, తాళ్లపూడి మండలం తాడిపూడిలో వింటి ఆదిలక్ష్మి అనువారి హత్య చేసి నదిలో పడేసినట్లు నిందితుడు షేక్ యాకోబు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. సాధారణంగా మనిషి నీటిలో మునిగి చనిపోతే మృతదేహం 24 గంటల్లో పైకి తేలుతుందని, కానీ 6 రోజులు గడుస్తున్నా ఎలాంటి జాడ లేకపోవడంతో ఆమెను నిజంగా నదిలోనే పడేశాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడైన యాకూబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొత్త పట్టిసీమ గ్రామస్తులు భారీ సంఖ్యలో తాళ్లపూడి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా మరియు ఆందోళన నిర్వహించారు మరియు భాదితురాలు స్వగ్రామమైన ఏలూరు జిల్లా, పోలవరం మండలం పట్టిసం గ్రామ రహదారి పై బయటాయించి ధర్న చేయుచున్నారని సమాచారం .
తూర్పు గోదావరి
తాడిపూడి హత్య కేసులో వీడని చిక్కుముడి