Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గాజువాక జంక్షన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జాగరపు శ్రీను ఆధ్వర్యంలో మహాత్ముడికి ఘన నివాళులు

గాజువాక, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాజువాక జంక్షన్‌లో మహాత్మా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ ఫౌండర్, గాంధీజీ విగ్రహ వ్యవస్థాపకుడు జాగరపు శ్రీను మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో నమ్మి సింహాద్రి, అండి బోయిన అప్పారావు, గుంటూరు శంకర్రావు, నెల్లి సాధురావు, చెల్లిబోయిన నాయుడు, ములకలపల్లి ప్రకాష్, గేశ్వరరావు, నెల్లి శ్రీను, పిత రమణ, అండి బోయిన పెద్ద నూకరాజు, గోవింద గౌడ్, యలమంచిలి మంగరాజు, వంగల శ్రీను, చప్పిడి నాగరాజు, సంపంగి శ్రీధర్, అంజూర్ దీపక్, మడక రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *