భైంసా: ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో రేపు (04-10-2026) ఉదయం 10 గంటలకు భైంసా పట్టణంలోని ఎస్.ఎస్. ఫ్యాక్టరీలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ముధోల్ నియోజకవర్గంలోని గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాలకు చెందిన CMRF లబ్ధిదారులను వెంట తీసుకొని నిర్ణీత సమయానికి కార్యక్రమానికి హాజరుకావాలని క్యాంపు కార్యాలయం కోరింది. అదేవిధంగా మండలాల సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిర్మల్