Tuesday, 5 May 2026

Blog

తిరుపతి

దసరా సెలవుల్లో క్లాసులు

శ్రీకాళహస్తి పట్టణంలో దసరా సెలవుల్లో కూడా పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలు.ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయకుండా శ్రీకాళహస్తిలో ని ప్రయివేట్ పాఠశాలలు దసరా కూడా నడపడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ప్రభుత్వ ఉత్తర్వులు భేఖాతారు చేస్తూ పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారెంట్స్ కోరుతున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి 10.45 నుంచి 11.00 గంటల మధ్య RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు.మునిరెడ్డి.అతను వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఆర్థిక పరిస్థితులు సరిలేక పోవడం వల్ల పార్ట్ టైం గా స్విగ్గి లో డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఇంటికి వెళుతుండగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వస్తున్న బస్సు అతివేగంగా వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్లు చూసి చనిపోయినట్లుగా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్

నాకు ప్రాణహాని ఉందని అంటున్న రావూరి రమణ రెడ్డి…!!

(పున్నమి,న్యూస్)వింజమూరు సెప్టెంబర్ 21://// ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండల బంగ్లా సెంటర్ దగ్గర ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకు ఎదురుగా సుజాతనగర్ లో రావూరి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను గత కొంతకాలం క్రితం మాకినేని మాల్యాద్రి భార్య అరుణమ్మల దగ్గర రావూరి రమణారెడ్డి ఒక్క లక్ష యాబై ఎనిమిది వేల రూపాయలకు 36 సంవత్సరాల క్రితం వారి దగ్గర సర్వే నెంబర్ 20061 బారు ఒకటి లో 33 సెంట్లు కొనుగోలు చేశాను అని ఆయన అన్నారు. 33 సెంట్లలో 29 సెంట్లు నా ఇంటి స్థలానికి ఉంచుకొని మూడు సెంట్లు స్థలాన్ని నేషనల్ రోడ్డు దగ్గర నుండి మా స్థలం చివరివరకు 19 అడుగుల వెడల్పుతో కూడిన దారి వదిలిపెట్టడం జరిగింది. సర్వేనెంబర్ 261-1లో నేను నా కుటుంబ సభ్యులు 30 సంవత్సరాలుగా ఈ స్థలంలో నివాసం ఉంటున్నాం కానీ ఇటీవల కాలంలో గత మూడు నాలుగు నెలలుగా వనిపెంట సుబ్బారెడ్డి మా స్థలమునకు ముందు ఉన్న స్థలం కొందూరి రత్నం అనే కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నేను కొన్నానని ఆయన చెబుతూ మేము దారి కొరకు విడిచిపెట్టిన దారి స్థలాన్ని వనిపెంట సుబ్బారెడ్డి ఆక్రమించి మేము ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముళ్ళకంచ నాటించారు. నేను వెళ్లి మా స్థానంలో మీరెందుకు కంచి వేశారు నాటాల్సిన అవసరమేంటి ఈ స్థలం మాది నేను కొన్న స్థలం మా ఇంటికి దారి కొరకు వదులుకున్న స్థలాన్ని నువ్వు ఆక్రమించి అక్రమంగా ముళ్లకంచి వేయించడం ఏంటి అని నేను అడిగాను అడిగి వనిపెంట సుబ్బారెడ్డి నా దారిలో నాటిన ముళ్లకంచెను మా కుటుంబ సభ్యులతో కలసి వాటిని తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకు నామీదకు దాడికి దిగి అసభ్యకరమైన పదజాలంతో నన్ను దూషిస్తూ నేను కంచి వేసేది వేసేదే వేస్తాను కూడా నీ దిక్కున చోట చెప్పుకోమని ఆయనతోపాటు మరికొందరు నామీదకి దౌర్జన్యంగా దాడికి దిగి నన్ను కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా నేను రెండు రోజులు క్రితం వింజమూరు బంగ్లా సెంటర్లో టీ తాగడానికి వెళ్ళినప్పుడు వలిపెంట సుబ్బారెడ్డి వనిపెంట మాధవరెడ్డి వనిపెంట సురేష్ సాహిత్ అనే నలుగురు వారితో కూడా మరికొందరు కలిసి బంగ్లా సెంటర్లో టీ తాగుతున్న సమయంలో ఒక్కసారిగా నా మీద పడి దాడి చేసి నా చొక్కా చించి నన్ను కొట్టడం జరిగింది. ఈ విషయమై వింజమూరు పోలీసు వారికి నేను ఫిర్యాదు చేశాను పోలీసు వారు కేసు నమోదు చేశాము అని చెప్పారు. కానీ వారిని పిలిపించి మాట్లాడింది కానీ వారి వారిని అరెస్టు చేసినట్లుగాని ఎలాంటి దాఖలాలు లేవు మా మీదనే కేసు పెడతావా మాకు ఎదురు తిరుగుతావా నువ్వు ఎంత నీ బ్రతుకంతా నిన్ను చంపేస్తామంటూ వాళ్లు పబ్లిక్ గా మాట్లాడుతూ నన్ను నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వనిపెంట సుబ్బారెడ్డి వనిపెంట మాధవరెడ్డి వనిపెట్టా సురేష్ రెడ్డి సాహిత్ వీరి వలన నాకు ప్రాణహాని ఉందని నన్ను చంపేస్తాము అని వాళ్ళు తిరుగుతున్నారని రావూరి రమణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని వారి చేతిలో నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడాలని ఆయన కోరారు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న నాకు న్యాయం చేయాలని నా కుటుంబానికి అండగా ఆయన ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నాను అధికారులు స్పందించి నాకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న చేస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నానని రావూరి రమణ రెడ్డి అన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఆసియాకప్ టి 20 మ్యాచ్ లో పాకిస్తాన్ను మరోసారి చిత్తు చేసిన భారత్

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @దుబాయ్ : దాయాది జట్టు పాకిస్థాన్ పై భారత జట్టు అదిరే ప్రదర్శన చేసింది. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్తాను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత పాక్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ సాహిబాజాదా ఫర్హాన్ (58) అర్ధశతకం చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (74: 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ల, శుభ్మన్ గిల్ (47: 28 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగి ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిక్స్లు, ఫోర్లతో హోరెత్తించాడు. ఓపెనర్ల దూకుడైన ఆటతో తొలి వికెట్కు 105 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. చివర్లో తిలక్ వర్మ (30*) రాణించాడు. సంజు శాంసన్ (13), హార్దిక్ (7*) పరుగులు చేశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్య పాక్కు కళ్లెం వేశాడు. మూడో ఓవర్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఫకార్ జమాన్ వెనుదిరిగాడు. వనౌన్లో వచ్చిన అయూబ్తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ను నిర్మించాడు. రెండో వికెట్కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో శివమ్ దూబె బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అయూబ్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తలత్ (10) సైతం వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. ఫర్హాన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుంటూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ ఔటయ్యాడు. మూడో ఓవర్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఫకార్ జమాన్ వెనుదిరిగాడు. వనౌన్లో వచ్చిన అయూబ్తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ను నిర్మించాడు. రెండో వికెట్కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో శివమ్ దూబె బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అయూబ్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తలత్ (10) సైతం వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా..ఫర్హాన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుంటూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నవాజ్ (21) రనౌట్గా వెనుదిరిగాడు. చివర్లో సల్మాన్, అప్రాఫ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ మంచి స్కోరే ఇచ్చిన 171 పరుగులు ను భరత్ 174 పరుగులతో విజయకేతానం ఎగారావేసింది.

ఆంధ్రప్రదేశ్

టీటీడీకి 18 క్లీనింగ్ యంత్రాలు విరాళం

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి@తిరుమల: కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) లో భాగంగా IDBI బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మెషీన్లను ఆదివారం విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈఓ శ్రీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ శ్రీ రామకృష్ణ కు యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ శ్రీ సోమన్నారాయణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ శ్రీ దూడల రాజేష్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

HYD – ORR నుంచి 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పలు ప్రాంతాలకు రీజినల్ రింగ్ రోడ్డు పనులు సర్కారు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ORR ఎగ్జిట్ నంబర్ 17 నుంచి దాదాపు 55 కిలోమీటర్లు పరిగి ORR వరకు ఈ రోడ్డు నిర్మించనుంది. ఇందుకు సంబంధించి మార్కింగ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు. దాదాపు 24 గ్రామాలను ఈ రహదారి కలుపుతుంది. రేడియల్ పనులు మొత్తం హెచ్ఎండీఏ పర్య వేక్షిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

శ్రీ దుర్గా దేవి నవరాత్రులకు భారీ బందోబస్తు 

– ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి, 21 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి  కామారెడ్డి జిల్లాలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ దుర్గా దేవి మండపాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈసారి లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగానే భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.అందులో భాగంగానే, ఉత్సవాల జరిగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. అలాగే, సీసీ కెమెరాల నిఘాలో ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. భక్తులు సైతం పోలీసులకు సహకరించాలని, అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం మహిళా పోలీసులను కూడా మోహరించినట్లు ఎస్పీ చెప్పారు. ఈ ఉత్సవాలు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ అంతర్జాతీయ

మాటమార్చిన ట్రంప్

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ వీసా ఫీజుపై వెనక్కి! భారత టెక్కీల్లో హుషార్ లక్ష డాలర్ల ఫీజు కొత్త వారికే హెచ్1బీ వీసా ఉన్న వారికి కాదు ఆ వీసాతో పనిచేస్తున్న వారందరికీ పాత ఫీజులే లక్ష డాలర్ల ఫీజు కూడా ఏడాదికి కాదు ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించేలా అవకాశం వైట్ హౌస్ సెక్రెటరీ కరోలినా ఊరట వ్యాఖ్యలు వివరణ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం

జాతీయ అంతర్జాతీయ

సింగ్రౌలి జిల్లాలో భూమి కింద 1 లక్ష టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉన్నట్లు అంచనా

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ బోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో భూమి కింద 1 లక్ష టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉన్నట్లు అంచనా. ఈ విలువైన నిధి జిల్లాలోని చకరియా గోల్డ్ బ్లాక్‌లో దాదాపు 23.57 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నిపుణుల ప్రకారం, ఈ అన్వేషణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే కాకుండా, దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. ఇప్పుడు ఇక్కడి భూమిని చీల్చుకుని అసలైన బంగారం బయటకు వస్తుంది – ఇది రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఇక్కడ దాదాపు 1.33 లక్షల టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలు భూమి కింద ఉన్నాయని అంచనా, ఇది రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి ఖనిజ ఉత్పత్తి రాష్ట్రాలలో ఒకటిగా మార్చడానికి ఒక పెద్ద అడుగు కావచ్చు. ఎలా మరియు ఎక్కడ దొరికింది ఈ బంగారు నిధి? సింగ్రౌలిలోని చకరియా ప్రాంతంలో విస్తృతమైన భూవిజ్ఞాన సర్వే మరియు పరీక్షల తర్వాత, దాదాపు 23.57 హెక్టార్ల ప్రాంతంలో భారీ మొత్తంలో బంగారం లభ్యమవుతుందని స్పష్టమైంది. ఈ ఖనిజ సంపద నుంచి దాదాపు 1 లక్ష 76 వేల 600 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ అన్వేషణ రాష్ట్రానికి ఆర్థికంగా లాభదాయకంగా ఉండటమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఒక ముఖ్యమైన ఘనతగా పరిగణించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల పన్నుపై పై ప్రభుత్వం కీలక నిర్ణయం

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త దరఖాస్తులకు ఆశించిన స్పందన రాలేదు. దీంతో, దరఖాస్తుల కోసం సమయం పొడిగించారు. ఇక.. బార్ల నిర్వాహకులు ఏఈఆర్టీ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నిరాసక్తత కారణంగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఏఈఆర్టీ సడలింపు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త బార్ల పాలసీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 412 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీంతో, మిగిలిన వాటికి సమయం పొడిగిస్తూ మరో సారి నోటిఫికేషన్ జారీ చేసింది. 17వ తేదీతో గడువు ముగిసింది. అయితే, 96 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మరో 336 బార్లకు దరఖాస్తులు రాలేదు. ప్రధానంగా గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్ల నిర్వహణకు వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. మద్యం షాపుల్లో పర్మిట్ రూమ్స్ కు అనుమతి.. రూ 99కే క్వార్టర్ లిక్కర్ అమ్మకాల కారణంగా బార్ల పైన వ్యాపారులు ఆసక్తి చూపటం లేదనే వాదన ఉంది. దీంతో, పాటుగా అదనపు ఎక్సైజ్ రిటైల్ టాక్స్ భారంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ టాక్స్ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.