Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని యువకుడు ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య కామారెడ్డి,22 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం, నర్సన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదనే మనస్తాపంతో ధ్యాప మహేష్ అనే 28 ఏళ్ల యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో నర్సన్నపల్లిలో విషాదఛాయలు అలుముకున్నా యి.గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, మహే ష్ గతంలో దుబాయ్‌లో పని చేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతని తండ్రి సాయిలు మహేష్‌కి పెళ్లి చేసి ఇంటికి కోడలిని తీసుకురావాలని ఎన్నో సంబంధాలు చూశాడు, కానీ ఏదీ కుదరలేదు. దీని తో మహేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, గతం లో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించి విఫలమ య్యాడు.ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మహేష్ ఎంతసే పటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని తండ్రి సాయిలు వెతుకుతూ వెళ్ళాడు. రైలు పట్టాల దగ్గర మహేష్ మృతదేహాన్ని చూసి సాయి లు గుండెపగిలేల రోదించాడు.సమాచారం అందు కున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు.సాయిలు ఫిర్యాదు మేరకు రైల్వే అధికారులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీఎచ్ కు తరలించారు. మహేష్ మృతితో అతని కుటుంబంలో విషాదం నిండిపో యింది. తమకు ఉన్న ఒకే ఒక్క కొడుకు దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన గ్రామస్థులను కలచివేసింది. మహేష్ మరణంతో ఆ కుటుంబానికి వారసులు లేకుండా పోయారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

యారబాడులో ఘనంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సత్సంగం

నరసన్నపేట మండలం యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యుల ఆధ్వర్యంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ముగింపు ఉత్సవంలో భాగంగా సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమ్మానాయుడు గారు, ఎంపీటీసీ కింజరాపు సూర్యనారాయణ గారు, మాజీ ఎంపీటీసీ సింహాచలం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ సురేంద్ర గారు, డిల్లేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ – “ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో అందరూ, ముఖ్యంగా మహిళలు కూడా హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయాలి. యోగా అనేది కనిపించే శరీరానికే కాకుండా, కనిపించని మనసు, బుద్ధి, ఆత్మ, చిత్తం వంటి వాటికీ ఉపయోగపడుతుంది” అని తెలిపారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురువుగారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు.కార్యక్రమంలో యారబాడు గ్రామ ప్రజలు, నరసన్నపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారికి అల్పాహారం పంపిణీ చేయబడింది. అలాగే స్టేట్ లెవల్ యోగా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన యోగా సుప్రజకు ఆమె గురువుగారు రవి సదాశివుని సమక్షంలో ఘన సన్మానం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటు: మంత్రి లోకేష్

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ వరల్డ్‌ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ కోసం రూ.150 కోట్లు ఖర్చు అవుతుంది. గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ వాళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు. 24 నెలల్లో సెంట్రల్ లైబ్రరీ పూర్తి చేస్తాం: మంత్రి లోకేష్‌. గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తాం: లోకేష్‌. డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు: నారా లోకేష్‌.

ఖమ్మం

రైతు సోదరుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులను అరికట్టాలి – రైతాంగాన్ని కాపాడాలి!

రైతు సోదరుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులను అరికట్టాలి – రైతాంగాన్ని కాపాడాలి! అన్నారుగూడెం గ్రామంలో ఈరోజు రైతు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో రైతాంగం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పొలాలలో పెరిగిపోయిన దొంగ వరి (నకిలీ గడ్డి)ని ప్రదర్శిస్తూ రైతులు గట్టిగా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన సమస్యలు: • ఈ ఖరీఫ్ సీజన్లో అన్నారుగూడెం, గోపాలపేట, బాలంపేట, మల్లారం, తల్లాడ, బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, వెంగన్నపేట, నూతనకల్ తదితర గ్రామాల్లో రైతులు వరి పొలాలలో వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. • కలుపు నివారణ కోసం పి ఐ కంపెనీ లగాసీ, బిఏఎస్‌ఎఫ్ కంపెనీ పాసెట్, బాసాగ్రామ్, బేయర్ కంపెనీ రైస్ బ్రాన్, కొట్టివా కంపెనీ నో వ్యాక్సిడ్ వంటి పలు మందులను 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసి స్ప్రే చేసినప్పటికీ ఫలితం రాలేదు. • వరిని పోలిన దొంగ వరి చావకుండా మరింత విస్తరించి, పొలాలను గడ్డి మయం చేసి, పంట దిగుబడి సగానికి తగ్గించే పరిస్థితి నెలకొంది. రైతుల ఆవేదన: “మేము రాత్రింబగళ్లు కష్టపడి పండించే పంటలను నకిలీ మందులు నాశనం చేస్తున్నాయి. కంపెనీలు లాభం కోసం నాసిరకం మందులు సరఫరా చేస్తూ రైతును అప్పుల బారిన పడేస్తున్నాయి. ఇలా సాగితే రైతు బతకలేడు, వ్యవసాయం కూడా బందు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కిసాన్ మోర్చా నాయకులు ఆపతి వెంకట రామారావు గా తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టులంటే ముఖ్యమంత్రి కి భయమేస్తుంది – సిపిఐ

అక్రమ అరెస్టులకు కన్యూనిస్టులు భయపడరు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం చిల్లర వర్తకులు, స్ట్రీట్ వెండర్లున్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొనకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు ని, ఏరియా పార్టీ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ లను ఇళ్ల వద్దనే ముందస్తుగా అరెస్ట్ చెయ్యాడాన్ని విరిద్దరూ తీవ్రంగా ఖండించారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులపై అన్యాయంగా కాల్పులు జరిపి నలుగురుని పొట్టన పెట్టుకొని, అక్రమంగా కేసులు పెట్టిన ఫలితంగా 2004 ఎన్నికల్లో ఇంటికి వెళ్లిన సంగతి గుర్తు చేసుకోవాలని, ఇప్పటికికైనా స్ట్రీట్ వెండర్లకు, చిల్లర వర్తకులకు అన్యాయం చెయ్యకుండా తక్షణమే వీరికి హాకర్ జోన్లు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

వీరభద్ర పేట గ్రామంలో త్రాగునీరు సమస్య – గిరిజనుల ఆందోళన

చింతలపూడి మండలంలోని వీరభద్ర పేట గ్రామ గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేశారు. అయితే, రోడ్డు పనుల కారణంగా గ్రామానికి నీటిని అందించే మెయిన్ పైప్ లైన్ కట్ అయిపోవడంతో త్రాగునీరు సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బిందెలతో దూరంలో ఉన్న నీటి ట్యాంకు వద్దకు వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. “జల్జీవన్ మిషన్ కింద ఇంటింటికి ఇచ్చిన కొళాయిలకు నీరు రాకపోవడం వల్ల వాటి ఉపయోగమే లేకుండా పోయింది” అని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.టి. దొర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీకి, మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమస్యను తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని ఆరోపించారు. పైప్ లైన్ వెంటనే రిపేర్ చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని గిరిజన సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జరత ఈశ్వరరావు, తామర్ల బుచ్చిబాబు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది: రాజ్‌నాథ్

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్

7.5 కి.మీ. రైల్వే సొరంగం

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.5 కి.మీ. రైల్వే సొరంగం నెల్లూరు-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణాదిలోనే అతి పొడవైన రైల్వే సొరంగం ఉంది. రూ.2 వేల కోట్లతో ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం వరకు 113 కి.మీ. రైల్వేలైన్ను 2019లో నిర్మించారు. ఇందులో భాగంగా చిట్వేలి, రాపూర్ మండలాల్లోని వెలుగొండ అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రూ.470 కోట్లతో నిర్మించారు. ఈ మార్గంలో చెరువులు, వంకలు దాటడానికి 15 పెద్ద వంతెనలు, 120 చిన్న వంతెనలను నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 13 నుంచి దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ‘మంగళకరం-2025’ పేరుతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో అక్టోబరు 13 నుంచి 17 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కృత్రిమ చేతులను అమర్చనున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి. రాజశేఖర్ తెలిపారు. కావాల్సిన వారు 72074 03150 నంబరుకు ఫోన్ చేసి వివరాలు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదు

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ ఆధార్ : ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. దీని కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.