Tuesday, 5 May 2026

Blog

నాగర్‌కర్నూల్

రాయపురెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 బీజినపల్లి మండలంలోని వెల్గొండ కాలనీలో BRS పార్టీ మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారి తండ్రి గారు రాయపు రెడ్డి గారు ఇటీవల మరణించడంతో ఈరోజు వారి ఇంటికి ఆయన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినా మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తిరుపతి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద మృత్యుంజయ హోమం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డు నందు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మహిళా మోర్చా నాయకురాలు ప్రజ్ఞశ్రీ మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించిన మహా మృతుంజయహోమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.తదనంతరం మొక్కలు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి హాజరుకండి.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంత్రి లోకేష్ ఆహ్వానం. సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి@అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలుపుకుందని తెలిపారు. దీనివల్ల ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేష్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో వ్యాపారి కిడ్నాప్.. మూడు టీంలు ఏర్పాటు

ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి కిడ్నాపైన వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. ఎస్ఐలు అరుణ్ రెడ్డి, రాజు, వెంకటరమణల నేతృత్వంలో మూడు బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. లక్ష్మీరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేస్తూ వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాగర్‌కర్నూల్

సిపిఐ పార్టీ పుట్టి నేటికీ వంద సంవత్సరాలు నిండిన వేళ పంజాబ్ రాష్ట్రంలో జాతీయ మహాసభలు జరగడం ఎంతో ప్రతిష్టాత్మకం, సిపిఐ

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లొ సిపిఐ జాతీయ 25వ మహాసభలో పాల్గొంటున్న సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే కేశవులు గౌడ్,లు జాతీయ వ్యాప్తంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పాసిస్తూ విధానాలను వ్యతిరేకంగా తేదీ, 21 నుంచి 25 వరకు జరిగే జాతీయ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీ తీసుకునే నిర్ణయాలను జాతీయవ్యాప్తంగా అమలుపరచి ఫాస్టెస్ట్ బిజెపి పార్టీని గద్దె దించే వరకు నిర్మించకుండా లౌకిక శక్తులను వామపక్ష పార్టీల ఐక్యతలను కూడగట్టి రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు జవాబు దారితనంగా ఉండి ప్రజల కష్టాలను గుర్తించి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ పార్టీ ఏర్పడి నేటికీ వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించడం అనేది ఆనాటి విప్లవ వీరుడు సాహిద్ భగత్ సింగ్ సొంత రాష్ట్రమైనటువంటి స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేసి రైతు ఉద్యమం లాంటి ఉద్యమాలను నిర్వహించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, సిపిఐ పార్టీ పురుడు పోసినప్పుడు ఏదైతే ఆశయాలను పెట్టుకున్నదో నేటికీ తూచా తప్పకుండా అమలు చేసే విధానం పరంగా ఎన్ని కష్టా నష్టాలు వచ్చినా ఎర్రజెండా పార్టీ బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం, కార్మికులు హక్కుల కోసం బడా పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా భూస్వామి పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను పోరాటాలు నరిపి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ప్రాణాలను కోల్పోయిన చరిత్ర భారత కమ్యూనిస్టు మాత్రమే దక్కిందని అన్నారు,

సినిమా

చిరు ప్ర‌స్దానానికి 47 ఏళ్లు

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ సినిమా: కొణిదెల శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్.. చిరంజీవిగా మారి నేటికి 47 ఏళ్లు. స‌రిగ్గా 47 ఏళ్ల క్రితం.. ఇదే రోజు ‘ప్రాణం ఖ‌రీదు’ సినిమా విడుద‌లైంది. చిరంజీవిని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసిన చిత్ర‌మ‌ది. ఆ త‌ర‌వాత చిరంజీవి అంచ‌లంచెలుగా ఎదిగి… సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగిన వైనం అంద‌రికీ చిర‌ప‌రిచిత‌మే. ఒక్కో అడుగూ వేసుకొంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఒక్కో ఇటుకా పేర్చుకొంటూ… ఇప్పుడు ఏకంగా ఓ సామ్రాజ్యాన్ని స్థాపించారు మెగాస్టార్‌. ఇండ‌స్ట్రీ రికార్డులు ఎలా కొట్టాలో, వాటిని ఎలా తిరిగ‌రాయాలో చిరంజీవికి తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలీదేమో..? న‌ట‌న‌లో, స్టైల్ లో, డాన్స్ లో, ఎంట‌ర్టైన్‌మెంట్ పంచ‌డంలో.. చిరు ఓ ప్ర‌త్యేక‌మైన దారి ఏర్పాటు చేసుకొన్నారు. ఆ దారే… చాలామంది హీరోలకు ర‌హ‌దారిగా మారి.. స్ఫూర్తిని పంచింది. మాస్ హీరో ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో వెండి తెర‌కు చూపించిన స్టార్ చిరంజీవి. నేల‌, బెంచి, బాల్క‌నీ.. ఈ కేట‌గిరీల‌న్నీ ఏకం చేసి.. అంద‌ర్నీ అభిమానులుగా మార్చుకొన్న స్టార్ చిరంజీవి. అందుకే 47 ఏళ్ల ఈ ప్ర‌స్థానం ఇంకా దిగ్విజ‌యంగా సాగుతూనే ఉంది. ఈ ప్ర‌యాణంలో 155 చిత్రాల్ని పూర్తి చేసుకొన్నారు. రాబోయే మూడేళ్ల‌లో క‌నీసం మ‌రో 5 సినిమాలైనా చేయ‌గ‌ల‌రు. మెగాస్టార్‌ 50 ఏళ్ల పండ‌గ‌ను.. ఇండ‌స్ట్రీ అంతా ఘ‌నంగా జ‌రుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ త‌రుణం కోసం మెగాఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త‌న న‌ట‌నా ప్ర‌స్థానంలో 47 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు చిరంజీవి. ప్రేక్ష‌కుల ఆశీస్సుల వ‌ల్లే… ఈ ప్ర‌యాణం సాధ్య‌మైంద‌ని, త‌న‌కొచ్చిన అవార్డులు, రివార్డులూ, పేరు ప్ర‌ఖ్యాతులూ.. ఇవ‌న్నీ అభిమానుల ఆశీర్వాద‌బ‌లం వ‌ల్లే అని, ఇక ముందు కూడా ఈ అభిమానం, ప్రేమ ఇలానే కొన‌సాగాల‌ని ట్వీట్ చేశారు చిరంజీవి.

నాగర్‌కర్నూల్

వైభవంగా రాఘవేంద్ర కాలనీ 2 దేవి శరన్నవరాత్రుల ప్రారంభం..

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 2 లో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా సోమవారం నాడు మొదటి రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజ వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి.బాల త్రిపుర సుందరి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య ఇరువెంటి స్వామి అనురాధ ,కటకం వీరాచారి శోభ దంపతులతో గణపతి పూజతో పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు మొదటి రోజు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రదోషకాలంలో సామూహిక కుంకుమార్చన బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని నేను ఆకులో తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాలమూరు శివ , నాని, రఘురాం, శివ, సునీల్ ,శ్యామల, సువర్ణ ,రాధిక యాదమ్మ, నాగమణి, బాలమణి, రామకృష్ణ మహిళలు చిన్నారులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని యువకుడు ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య కామారెడ్డి,22 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం, నర్సన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదనే మనస్తాపంతో ధ్యాప మహేష్ అనే 28 ఏళ్ల యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో నర్సన్నపల్లిలో విషాదఛాయలు అలుముకున్నా యి.గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, మహే ష్ గతంలో దుబాయ్‌లో పని చేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతని తండ్రి సాయిలు మహేష్‌కి పెళ్లి చేసి ఇంటికి కోడలిని తీసుకురావాలని ఎన్నో సంబంధాలు చూశాడు, కానీ ఏదీ కుదరలేదు. దీని తో మహేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, గతం లో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించి విఫలమ య్యాడు.ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మహేష్ ఎంతసే పటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని తండ్రి సాయిలు వెతుకుతూ వెళ్ళాడు. రైలు పట్టాల దగ్గర మహేష్ మృతదేహాన్ని చూసి సాయి లు గుండెపగిలేల రోదించాడు.సమాచారం అందు కున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు.సాయిలు ఫిర్యాదు మేరకు రైల్వే అధికారులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీఎచ్ కు తరలించారు. మహేష్ మృతితో అతని కుటుంబంలో విషాదం నిండిపో యింది. తమకు ఉన్న ఒకే ఒక్క కొడుకు దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన గ్రామస్థులను కలచివేసింది. మహేష్ మరణంతో ఆ కుటుంబానికి వారసులు లేకుండా పోయారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

యారబాడులో ఘనంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సత్సంగం

నరసన్నపేట మండలం యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యుల ఆధ్వర్యంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ముగింపు ఉత్సవంలో భాగంగా సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమ్మానాయుడు గారు, ఎంపీటీసీ కింజరాపు సూర్యనారాయణ గారు, మాజీ ఎంపీటీసీ సింహాచలం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ సురేంద్ర గారు, డిల్లేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ – “ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో అందరూ, ముఖ్యంగా మహిళలు కూడా హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయాలి. యోగా అనేది కనిపించే శరీరానికే కాకుండా, కనిపించని మనసు, బుద్ధి, ఆత్మ, చిత్తం వంటి వాటికీ ఉపయోగపడుతుంది” అని తెలిపారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురువుగారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు.కార్యక్రమంలో యారబాడు గ్రామ ప్రజలు, నరసన్నపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారికి అల్పాహారం పంపిణీ చేయబడింది. అలాగే స్టేట్ లెవల్ యోగా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన యోగా సుప్రజకు ఆమె గురువుగారు రవి సదాశివుని సమక్షంలో ఘన సన్మానం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటు: మంత్రి లోకేష్

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ వరల్డ్‌ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ కోసం రూ.150 కోట్లు ఖర్చు అవుతుంది. గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ వాళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు. 24 నెలల్లో సెంట్రల్ లైబ్రరీ పూర్తి చేస్తాం: మంత్రి లోకేష్‌. గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తాం: లోకేష్‌. డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు: నారా లోకేష్‌.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.