Tuesday, 5 May 2026

Blog

తిరుపతి

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన కొట్టె సాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఎంపికైన కొట్టే సాయి సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

యాదాద్రి భువనగిరి

శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రతిష్టాపన

శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాజీ బూర నర్సయ్య గౌడ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారు మాయా దశరథ గారు జగన్మోహన్ రెడ్డి గారు షవర్ కార్డ్ దుర్గామాత నిర్వాహకులు రత్నాపురం శ్రీశైలం గారు కామెడీ భరత్ రెడ్డి కార్తీక్ మరియు తదితరులు పాల్గొన్నారు..

యాదాద్రి భువనగిరి

దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతిని ధి ఈరోజు హైదరాబాద్ చౌరస్తా సవర్కా దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మొదటి రోజు కావున అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ భక్తులను దీవించమని బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా వేదమంతాలతో బాలా త్రిపుర సుందర దేవి అష్టోత్తరలతో బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం గారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సవర్త దుర్గామాత ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని కోరుకుంటూ నవరాత్రులు అత్యంత వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏర్పాటులని నిర్వహిస్తున్నాము కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కోరారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ మాయ దశరథ గారు పాల్గొని అఖండ దీప స్థాపన ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వాహకులు కామెడీ భరద్వాజ్ నరసింహ బెండ శ్రీకాంత్ నాగరాజు సునీల్ కుమార్ నమిలి నందు రాకేష్ కాలేరు లక్ష్మణ్ గౌతమ్ సోను కళ్యాణ్ సన్నీఅమ్మవారి మాలలు వేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం జై బోలో కనకదుర్గ మాతాకీ జై అఖిల్ ఆది కార్తీక్ పాల్గొన్నారు మరికొందరు మహిళలు అమ్మవారి మాలలు వేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం జై బోలో కనకదుర్గ మాతాకీ జై

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో అధికార – ప్రతిపక్ష పార్టీల ఇంచార్జులుగా తండ్రి – తనయ

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా గొల్లపల్లి అమూల్య. ఈరోజు రాజోలు నియోజకవర్గ ఇంచార్జి గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేదిన టిడిపి అధిష్టానం. ఈమె మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ రాజోలు ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు తనయురాలు. ఒకే నియోజకవర్గంలో తండ్రీ కూతుళ్ళ సవాల్ గా మారనుంది.

యాదాద్రి భువనగిరి

రాయగిరి మున్సిపల్ సమస్య పరిష్కరించాలి

ఈ రోజు భువనగిరి పట్టణం లోని స్థానిక రాయగిరి లొ విధి దీపాలు శానిటేషన్ మరియు కుక్కలు కోతలా నుండి రాయగిరి ప్రజలు ను కాపాడాలి అని మాజీ వార్డ్ మెంబెర్ ఎండీ ఫసి గారు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి మీ సమస్య వెంటనే పరిష్కారం చేస్తా అని హమి ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా వార్డ్ ప్రజలు తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేశారు..

అన్నమయ్య

రాచపల్లి గ్రామంలో భగవద్గీత పోటీలలో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం

ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఆదివారం సెప్టెంబర్ 14న చిట్వేలి మండలం ఎం.రాచపల్లి గ్రామంలో విద్యార్థులకు భగవద్గీత పై కాంపిటేషన్ నిర్వహించారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం భగవద్గీతను అనర్గళంగా చూసి చదివిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్వేలి గ్రామానికి చెందిన శ్రీ రాయిపెద్ది సుబ్రహ్మణ్యం శర్మ హాజరయ్యారు. ముందుగా ఆయనను గ్రామ ప్రజలు, యువత కలిసి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భగవద్గీత ను అనర్గళంగా చూసి చదివిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిసి వారిని బ్రాహ్మణ శ్రీ సుబ్రహ్మణ్యం శర్మ ఘనంగా సత్కరించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి చొక్కారాజు మోహన్ రాజు -రుపినమ్మల కుమార్తె యశస్విని అందుకున్నారు, రెండవ బహుమతి వెలిగిండ్ల త్యాగరాజు కుమార్తె కారుణ్య, మూడవ బహుమతి పాండురాజు నరసింహరాజు -సావిత్రమ్మ ల కుమారుడు సంతోష్ రాజు బహుమతులు అందుకున్నారు. వారం వారం క్రమం తప్పకుండా భగవద్గీత క్లాసులకు హాజరైన విద్యార్థులు వెలిగిండ్ల రెడ్డయ్య రాజు, పాండురాజు మోక్షిత, పాండు రాజు సంతోష్ రాజు, పాండురాజు లక్ష్మి, రాఘవ రాజు యోగేశ్వర్ రాజుకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ చిట్వేలి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన మా శిష్యుడు రామ్మోహన్ ఎంతో ఓపికతో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు నిర్వహిస్తున్నారని అటువంటి వారికి నేను ఎల్లప్పుడూ సహాయంగా ఉండి వారిని ఆశీర్వదిస్తానని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో భగవద్గీతను ప్రతిరోజు ఆచరిస్తే చిన్నప్పటి నుంచి పిల్లలకు బుద్ధి, గుణం, సంస్కారం, పెద్దలపట్ల గౌరవం, వంటివి అలవాటు అవుతాయని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజలు టీవీ సీరియల్స్ కి అలవాటైపోయారని అది మంచి అలవాటు కాదని. పిల్లలతో పాటు మీరు కూడా భగవద్గీతను చదివిన, విన్న ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని టీవీ సీరియల్స్, సినిమాలకు అలవాటు పడకుండా మన హిందూ సంప్రదాయాలు పట్ల గౌరవంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తదుపరి రాచపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువు రామ్మోహన్ ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గురువు రామ్మోహన్ మాట్లాడుతూ రాచపల్లి గ్రామంలో చాలామంది విద్యార్థులు ఉన్నారని కేవలం 13 మంది హాజరు కావడం చాలా బాధ కలిగించిందని ఈసారైనా తప్పకుండా గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకొని భగవద్గీత క్లాసులకు పంపించమని ఆయన గ్రామంలోని పెద్దలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ధర్మనిధి సభ్యులు గురువు రామ్మోహన్, మన్నూరు శేఖర్ రెడ్డి, చెర్లోపల్లి గ్రామానికి చెందిన ధర్మనిధి సభ్యులు, గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలు, భగవద్గీత విద్యార్థులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

జిఎస్టీ సవరణలపై ఎల్ ఐ సి ఏజంట్ల హర్షం

కేంద్ర ప్రభుత్వం సవరించిన జిఎస్టీ సవరణలలో భాగంగా ఇన్సూరెన్స్ లకు జీరో శాతం జీఎస్టీ విధించడం పై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు సంబరాలుచేసుకున్నారు.ఈకార్యక్రమంలో వివి.సుబ్బారావు,డివిజనల్ ప్రెసిడెంట్,జి.సతీష్ బాబు డివిజనల్ సెక్రటరీ నారాయణస్వామి ,వై.బాబురావు,ఈశ్వర్,మనీ,అమృత,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి బాధితుల తరుపున నిలబడటం నేరమ

ఆ కాకినాడ సెప్టెంబర్ 22, ఉప ముఖ్యమంత్రి బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ నచ్చి జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో కుటుంబాలను సైతం పట్టించుకోకుండా కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎదుగుదలే లక్ష్యంగా పనిచేసిన జన సైనికులకు జనసేన వీర మహిళలకు కాకినాడ నగరంలో వారికి ఏ కష్టం వచ్చిన ఆనందం వచ్చిన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో తామందర్నీ ఒక తాటిపైకి తెచ్చి కంగారు పడొద్దు అని చెప్పిన దుర్గన్న బాబ్జి వద్దకు వచ్చిన కొంతమందితో మీటింగ్ ఏర్పాటు చేసి మన నాయకుడు నిస్వార్ధపరుడు మంచి వ్యక్తి మనకి అన్యాయం జరగదని చెప్పి రాబోయే కాలంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని నచ్చచెప్పి లోకల్ ఎన్నికలకు మనం అందరం సమసిద్దంగా ఉండాలని చెప్పినందుకు జనసేన పార్టీలోనే ఉంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్న కొంతమంది నాయకులు తమ నాయకుడు బాబ్జి పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుగ్గన వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల క్రితం జరిగిన ఆస్తి తగాదా లో బాధితుల తరఫున న్యాయం చేసేందుకు దుగ్గన బాబ్జి నిలబడితే దానిని సాకుగా చూపి ఆయన్ను రాజకీయంగా బద్నాం చేద్దామని తమ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ అభిమాన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న జనసేన గెలుపుకు మేము చేసిన ప్రయత్నాన్ని గుర్తిస్తారని జన సైనికులకు వీర మహిళలకు అండగా నిలిచి పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తారని ఇప్పటికి కూడా అదే మాట మీద నిలబడి ఉన్నామని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ బాధితులు తరఫున ఆయన ఏ విధంగా పోరాడుతారో చూసే తామంతా జనసేనకు వచ్చి ఈ పార్టీలో ఉన్నామని ఇది జనసేనలో అధికారం అనుభవిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలోని నాయకులు కొంతమంది తమ స్వలాభం కోసం రాత్రులు వైసిపి తోను పగలు జనసేనలోనూ ఉంటూ తమ పబ్బం గడుపుకునే కొంపల్లి సత్య వంటి మహిళలను ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న నాయకులు వత్తాసు పలకడం వల్ల జనసేన పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని కేవలం ఇదే ఆవేదన తప్ప వేరే ఆలోచన తనకు లేదని బాబ్జి అన్నారు. నష్టపోయిన బాధితుల తరఫున పోరాడమే తమ తప్పయితే చెప్పాలని అన్నారు. దుగ్గన బాబ్జి బై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమే తప్ప వేరేది లేదని వీర మహిళలుగా తాము చెప్తున్నామని రాయుడు దుర్గ, బట్టు లీల , బోడపాటి మరియా, తదితరులు ఈ విషయాన్ని ఖండించారు

తెలంగాణ

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు కొన్ని శాఖల ద్వారా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈనెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 23న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,డిసీహెచ్ఎస్, యువజన సర్వీసులు, కార్మిక శాఖలు, ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని, 24న వ్యవసాయ,ఉద్యాన, సెరికల్చర్, హ్యాండ్లూమ్స్, పశుసంవర్ధక శాఖలు, 25న మున్సిపల్, ట్రాన్స్కో ఫిషరీస్, సంక్షేమ శాఖలు, ఆధ్వర్యంలో నిర్వహించాలని,26న డిఆర్డిఓ,డిపిఓ,సిపిఓ, ఆర్టీసీ,మెప్మా శాఖలు నిర్వహించాలని, 27న అటవీశాఖ, పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఆర్డిఓ శాఖలు నిర్వహించాలని,28న రెవెన్యూ, దేవాదాయ,సహకార, పౌర సంబంధాల, టీఎన్జీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. 29న జిల్లా విద్యాశాఖ, అన్ని ఇంజనీరింగ్ శాఖలు, మెప్మా తో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈనెల 30న బార్ అసోసియేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. నల్గొండ ఆర్డిఓ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మున్సిపల్ కమిషనర్, ఎన్ జి కళాశాల మైదానంలో లైటింగ్, డయాస్, తాగునీరు, ఇతర ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుద్ధవనంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నందికొండ మున్సిపల్ కమిషనర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్, పెద్దవూర తహసిల్దార్ లు, ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ

GST బచత్ ఉత్సవ్ పై కేటీఆర్ ఫైర్ – ప్రజలకు నిజమైన ఉపశమనం ఎప్పుడు?

GST సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “8 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ GST మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారా? మీరు చెబుతున్న GST బచత్ ఉత్సవ్ అంటే ప్రజలతో ఆటలాడటమే. నిజంగా ప్రజల భారం తగ్గించాలంటే ముందుగా డీజిల్, పెట్రోల్ ధరలను రూ.50కి, గ్యాస్ సిలిండర్ ధరను రూ.350కి తగ్గించండి. GST డబ్బును తిరిగి ప్రజలకు ఇవ్వండి. అప్పుడు మాత్రమే నిజమైన ఉత్సవాలు జరుగుతాయి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మోసపూరిత కార్యక్రమాలు కాకుండా, నిజమైన ఉపశమనం అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.