Tuesday, 5 May 2026

Blog

తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసి ఎరుకల కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలి.. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం అధ్యక్షులు రాజు డిమాండ్..

పున్నమి: రాజకీయ ప్రాధాన్యం లేని ఆదివాసి ఎరుకల కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్ లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకలకు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక చాలా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ శాసనమండలిలో మా తరఫున మాట్లాడే వారే లేక సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. రాజ్యాంగం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఎరుకల కులస్తులకు రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా తొక్కి పెట్టడం అణిచివేతకు నిదర్శనమని మండిపడ్డారు.ఇతర కులాలకు అవకాశాలు కల్పించినప్పుడు ఎరుకల కులస్తులకు రాజకీయంగా ఎందుకు ఇవ్వడం లేదని ఆయా రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా పార్టీలకు జాతి నుండి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికిన పివిజి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం నావెల్ కోస్ట్ హెలిప్యాడ్ కు విచ్చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ముఖ్యమంత్రిని అభివాదిస్తూ పి.వి.జి. కుమార్ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాలు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలు ప్రజలందరికీ మేలుచేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పి.వి.జి. కుమార్ మాట్లాడుతూ – “తెలుగు రాష్ట్రం ప్రగతి మార్గంలో ముందుకు సాగేందుకు చంద్రబాబు నాయకత్వం అపూర్వమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన చూపిస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ గర్వకారణం” అని అన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు

ఖమ్మం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్భా రీ చేరిక లు

పున్నమి ప్రతినిధి ఖమ్మం. ఖమ్మం జిల్లా పరిధిలోని మధిర నియోజకవర్గం లో గల ముదిగొండ మండలంలోని బీఆర్ఎస్ నాయకత్వం,కార్యకర్తలు మొత్తంగా భారీ ఎత్తున తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అందరికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు వెల్లువెత్తుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా అమలు చేస్తుందన్నారు గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 7.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి వ్యవస్థలను ధ్వంసం చేశారు.ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదు . కేంద్రాన్ని పలుమార్లు కలిసి వడ్డీ భారాన్ని తగ్గించాం, 11.5% వడ్డీని 8%కు తగ్గించి రాష్ట్రానికి ఊరట కలిగించమన్నారు ఉద్యోగుల బకాయిలను నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తున్నాం, గత పది సంవత్సరాలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది, రహదారులు, పాఠశాలలు, ఇళ్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవే.గోదావరి పై లక్ష కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం రాష్ట్ర దురదృష్టం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు ప్రజా ప్రభుత్వం మళ్లీ జీవం పోస్తోందన్నారు రాష్ట్ర ఆర్థిక స్థితి కఠినమైనప్పటికీ, యావత్ క్యాబినెట్ రోజుకు 18 గంటల పాటు కృషి చేస్తోంది, ప్రజా ఓటు విలువను రాష్ట్ర ప్రగతికి వినియోగిస్తున్నామన్నారు మూడు నెలల్లోనే 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, తొమ్మిది రోజుల్లోనే 9 వేల కోట్ల రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రజా ప్రభుత్వ ప్రత్యేకత . 5 లక్షలతో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు మద్దతు ధరతో పాటు 500 బోనస్, 29 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్, 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, మరో 30 వేల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మహిళా సంఘాలకు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం, ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అని అన్నారు

ఆంధ్రప్రదేశ్

✨ SPECIAL OFFER – LIMITED TIME ✨ 👥 For: Reporters | Senior Reporters | Staff Reporters | Ad Managers

🌟 Your Success Story – Our Spotlight! 🌟 🎤 రాజకీయ నాయకుల ప్రత్యేక పరిచయం 🖋️ ప్రతిభావంతమైన రచయితల ప్రొఫైల్ హైలైట్ 💼 బిజినెస్ వ్యక్తులకు ప్రొఫెషనల్ ఫీచర్ స్టోరీ 💰 Investment: ₹999/- మాత్రమే 📅 Validity: 2 Days 🎯 Seats: 5 Members Only 📌 Don’t Miss This Golden Chance! 📞 Call Now: 8121971333 | 9440275034 📜 RNI NO: APTEL/2013/50066 🧾 GST NO: 37ATVPS3518D1Z9 🏛️ Central Govt. Registered Newspaper 📑 DAVP & I&PR Empanelled Video: https://www.punnami.in

ఆంధ్రప్రదేశ్

🎓 కేవలం డిగ్రీ అర్హతతో 🏦 గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు 🌐 AP & Telangana Circles లో భారీ నియామకాలు

👨🏻‍🏫 IBPS CRP RRBs XIV Recruitment 2025 📌 Posts: Clerk, PO, Officers Scale I, II & III 💼 Total Vacancies: 13,217 Video: https://studybizz.com/jobs/ibps-rrb-recruitment-2025/

ఆంధ్రప్రదేశ్

🔰 రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు 🔰

📅 తేదీలు: సెప్టెంబర్ 23 – 26 🏢 స్థలం: రాష్ట్రంలోని అన్ని సచివాలయాలు ✨ దసరా సెలవుల సందర్భంగా ఆధార్ నమోదు & సవరణ కోసం ప్రత్యేక శిబిరాలు

ఎన్ టి ఆర్ జిల్లా

🚨 NITTTR Chandigarh Non-Teaching Recruitment 2025 🚨

📌 Organization: National Institute of Technical Teachers Training & Research (NITTTR), Chandigarh 📌 Post Type: Non-Teaching 📌 Total Vacancies: 16 🎓 Eligibility: 10th / 12th Pass / Graduate 💰 Salary Range: ₹18,000 – ₹2,08,700 📅 Last Date to Apply: 15th October 2025 Video: https://govtjobsalert.in/nitttr-chandigarh-non-teaching-recruitment-2025/

ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పొతవరం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పొతవరం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలలొ భాగంగా ఎనిమిది మండపాలు ఏర్పాటు చేయడమైనది దానిలో లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి కోలాట శభజన మండలి వారి ఆధ్వర్యంలో కోలాటం ఏర్పాటు చేయడమైనది

నాగర్‌కర్నూల్

శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS పార్టీ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS పార్టీ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి మరియు వారి సతీమణి డాక్టర్ నాగం మీరా రెడ్డి . అనంతరం దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. వారి వెంబడి BRS పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అర్థం రవి, బోనాసి లక్ష్మయ్య లక్ష్మయ్య,భీమయ్య, శంకర్, భీముడు, సత్యం విష్ణు చారి, అహ్మద్, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.