Tuesday, 5 May 2026

Blog

ఎలూరు

తిమ్మిరెడ్డి పల్లి లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మేఘ ఉచిత గుండె వైద్య శిబిరం.

తిమ్మిరెడ్డి పల్లి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఏలూరు జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో సేవా పక్షోత్సవాల భాగంగా ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్ హాజరై ప్రారంభించారు. అనంతరం సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కుర్ర వెంకట సుబ్రమణ్య వరప్రసాద్, సేవా పక్షోత్సవాల మండల కన్వీనర్ గంగవల్లి శ్యామ్ శేఖర్, కో-కన్వీనర్లు సయ్యద్ మీర్ జాఫర్ అలీ, అనిల్ బొంకురి, మండల అధ్యక్షుడు తాడిపత్రి శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షురాలు కొత్తపల్లి విజయకుమారి, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సింగం కృష్ణ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎలూరు

స్టేట్ వాలంటరీ సెక్రటరీగా ముసునూరు వెంకటేశ్వరరావు ను నియమించారు

నరసన్న పాలెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఏలూరు జిల్లా…. *లింగపాలెం మండలం నరసన్నపాలెం పంచాయతీ, వైయస్సార్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముసునూరి వెంకటేశ్వరరావు స్టేట్ వాలంటీర్ సెక్రెటరీగా నియమించారు ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని పార్టీ కోసం నిరంతరం కష్టపడతానని వెంకటేశ్వరరావు గారు తెలియపరిచారు* *నాకు ఈ పదవి రావటానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు గారికి లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు శాంతారావు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దూలం,నాగేశ్వరావు( DNR) కారుమూరి సునీల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు*

ఎలూరు

స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా నియమింపబడిన కలరాయినిగూడెం సర్పంచ్ చల్లగొల్ల రవిబాబు

కలరాయినిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఏలూరు జిల్లా…. *లింగపాలెం మండలం కలరాయిలగూడెం పంచాయతీ సర్పంచ్ చల్లగుళ్ళ రవి బాబు ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చల్లగుళ్ళ రవిబాబు స్టేట్ సోషల్ మీడియా సెక్రెటరీగా నియమించారు ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని పార్టీ కోసం నిరంతరం కష్టపడతానని రవిబాబు తెలియపరిచారు* *నాకు ఈ పదవి రావటానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు గారికి లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు శాంతారావు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దూలం,నాగేశ్వరావు( DNR) కారుమూరి సునీల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు*

విశాఖపట్నం

స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి జాతీయ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయండి.

విశాఖ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విజయవంతం కావాలని జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఇతర అధికారులతో కలసి విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నోవాటెల్ హోటల్‌లో జరగనున్న సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. రిజిస్ట్రేషన్ సులభతరం చేయాలని, కౌంటర్లు పెంచాలని, ఆన్లైన్ లింక్ ద్వారా నమోదు కల్పించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, లైజన్ అధికారుల బాధ్యతలను స్పష్టంగా వివరించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల వద్ద అతిథులను స్వాగతించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సదస్సు ప్రతిష్టాత్మకంగా జరుగాలని, అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

విశాఖ నగర పోలీసులకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు

విశాఖపట్నం , సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) విశాఖ నగర పోలీసు కమిషనర్ Dr. శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., ప్రారంభించిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రం సేవలకు గుర్తింపుగా విశాఖ సిటీ పోలీస్‌కు ఢిల్లీలో 20-09-2025న నిర్వహించిన 102వ స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. హిట్ అండ్ రన్ ఘటనలలో బాధితులకు ప్రభుత్వ పరిహారం అందించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, ఫారమ్‌లు, సహకార సేవలు అందిస్తూ ఇప్పటివరకు రూ.63.50 లక్షల పరిహారం అందజేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 7995095793 ద్వారా సేవలు అందుతున్న ఈ కేంద్రానికి నగర ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

చిత్తూరు

పండగ పూట పరేషాన్ :

వి.కోట , సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) దసరా సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం వి.కోట నుండి చిత్తూరు పంపిన పూల సంచి APSRTC హైరాబస్‌ లో పార్సల్‌గా బుక్ చేయబడింది. రసీదు నం. 69732986తో పంపిన ఈ పార్సల్ బస్సు చిత్తూరు చేరినా, పార్సల్ కార్యాలయంలో అందలేదు. అధికారులు నిర్లక్ష్యంగా స్పందించారు. చివరకు బస్సు కొంగారెడ్డిపల్లి వద్ద నిలిపి, రాత్రి 10 గంటలకు పార్సల్ లభించింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. “గుడ్ గవెరెనెన్స్” పేరిట సేవలని చెప్పుకుంటూ, ఈ విధమైన ఘటనలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయుతున్నాయి. ఇకనైనా బస్సు సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, ఈ రకం సమస్యలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా న్యూస్ ప్రతినిధి పున్నమి న్యూస్ రిపోర్టర్ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆ దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ…ప్రజలందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.

హైదరాబాద్

నందకిషోర్ రెడ్డికి కాకతీయ కీర్తి పురస్కారం

శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారి విశ్వ కళావైభవం అంతర్జాతీయ 1,113 సాంస్కృతిక మూత్సవాలు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థపాక అధ్యక్షులు,గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళా విరాట్ డా”శాంతి కృష్ణ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ మహోత్సవాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మహోత్సవాలలో దక్షిణ భారతదేశంలో సుమారు 5 వేలకు పైగా దేవాలయాల సంరక్షణలపై పరిశోధన చేసిన నెల్లూరు వాసి కె నందకిషోర్ రెడ్డికి కాకతీయ కీర్తిసేవా పురస్కారాన్ని అతిధుల చేతుల మీదుగా అందించారు.

E-పేపర్

సుంకులమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల పూజలు

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సుంకులమ్మ వీధిలో ఉన్న పురాతన సుంకులమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేషాలంకారాలతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థాన కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ, గౌరవ అధ్యక్షులు గోపిశెట్టి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు న్యాయవాది గోపిశెట్టి ప్రసాద్,కార్యదర్శి చిమ్మా నాగన్న,గౌరవ సలహాదారు ఎంచెర్ల నరసింహారావు, కోశాధికారి పొన్నపాటి జగన్నాథం,బైగ్గారి ప్రసాద్,బైగ్గారి వెంకట మురళి కృష్ణ తెలియజేశారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దసరా పర్వదినాలలో భక్తులు గ్రామ దేవత గా 100 సంవత్సరాలకు పూర్వం వెలసిన సుంకుల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతిరోజు అమ్మవారిని,గుడి ప్రాంగణంలో ఉన్న శివాలయం, సీతా రాముల వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

రంగారెడ్డి

హయత్ నగర్: మానవత్వం చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హయత్ నగర్ ప్రాంతంలోని బంజారా కాలనీలో భారీగా వరద నీరు చేరి కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇళ్లలో ఉన్న సామగ్రి తడిచిపోయింది. దీంతో ఉదయం నుంచి కాలనీ వాసులు తినడానికి ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ సిబ్బందితో కలిసి బాధితులకు ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.