Tuesday, 5 May 2026

Blog

శ్రీకాకుళం 

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి

నల్లజర్ల మండలం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్లజర్ల మండలం నల్లజర్ల గ్రామంలో ప్రియాంకా మినీ ఫంక్షన్ హాల్ నందు గోపాలపురం నియోజకవర్గానికి 18 వ విడతగా 30 చెక్కులకు గాను రూ. 20 లక్షల 67 వేల రూపాయలు మంజూరూ చేయడం ద్వారా నియోజకవర్గంలోని పలు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక భరోసా కల్పించబడింది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మన శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు అందజేశారు ఇప్పటి వరకూ గోపాలపురం నియోజకవర్గంలో 558 కుటుంబాలకు 5 కోట్ల 70 లక్షల రూపాయలు CMRF ద్వారా ఆర్ధిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి గోపాలపురం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన మన శాసనసభ్యులు.

శ్రీకాకుళం 

సొసైటీ అధ్యక్షులు మరియు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి

నల్లజర్ల మండలంసెప్టెంబర్ (పున్నమిప్రతినిధి) నల్లజర్ల గ్రామంలో ప్రియాంకా ఫంక్షన్ హాల్ నందు సొసైటీ అధ్యక్షులు మరియు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని రైతులు వ్యవసాయానికి పెట్టుబడికి ఇబ్బంది పడకుండా సకాలంలో సొసైటీ నుండి పంట రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని అలాగే వివిధ రైతుల సమస్యల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఆప్ కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి

అశ్విజ మాస తిరు కల్యాణ మహోత్సవం ఆహ్వానం అందుకున్న మద్దిపాటి

నల్లజర్ల మండలం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్లజర్ల మండలం నల్లజర్ల ఎమ్మెల్యే కార్యాలయం నందు ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆశ్వీజ మాస తిరు కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు కి అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన, ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి NV సత్యనారాయణమూర్తి ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కూచిపూడి ఉదయ భాస్కర్ , రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి

వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనే కార్యక్రమానికి హాజరైన మద్దిపాటి

నల్లజర్ల మండలం సెప్టెంబర్ ( పున్నమిప్రతినిధి ) రాజమండ్రిలో One Election – One Nation కార్యక్రమానికి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు హాజరయ్యారు. ముఖ్య అతిథులు న్యూ ఢిల్లీ ఎంపీ కుమారీ బాన్సూరీ స్వరాజ్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి (అధ్యక్షత), రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మద్దిపాటి వెంకట రాజు, దేశ ప్రజల ఆలోచనలను గౌరవిస్తూ, సంస్కరణలను అట్టడుగు స్థాయిలో అందించడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. వన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గి దేశవృద్ధికి సహాయపడతుందని, జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు లబ్ధి అందుతుందని అభినందించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సరుగుడు చెట్ల అక్రమ నరికివేత… తీరప్రాంత ప్రజల్లో ఆందోళన

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – కాట్రేనికోన. సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి కాట్రేనికోన మండలం సముద్రతీర ప్రాంతంలో సరుగుడు చెట్ల అక్రమ నరికివేత ఆందోళన కలిగిస్తోంది. అలల తాకిడిని అడ్డుకునే మడ అడవులు, ఉప్పు గాలులను తగ్గించే మొగలిపొదలు కనుమరుగవుతుండటంతో తీరప్రాంత ప్రజలు విపత్తుల భయంతో జీవిస్తున్నారు. బ్రహ్మసమేధ్యం పంచాయతీ పరిధిలోని నీళ్ళరేవు గ్రామం వద్ద 60 ఎకరాలకు అనుమతి ఇచ్చినా, దాన్ని మించి పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అటవీ, రెవెన్యూ శాఖల నిర్లక్ష్యంతో లారీ లారీగా చెట్ల తరలింపులు జరుగుతున్నాయి. అధికారుల నిర్లిప్త వైఖరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) లో భాగంగా IDBI బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మెషీన్లను ఆదివారం విరాళంగా అందించింది

*టీటీడీకి 18 క్లీనింగ్ యంత్రాలు విరాళం* తిరుపతి జిల్లా, సెప్టెంబర్ 22 (పున్నమి ప్రతి నిధి, రామ్) . ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈఓ శ్రీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ శ్రీ రామకృష్ణ కు యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ శ్రీ సోమన్నారాయణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ శ్రీ దూడల రాజేష్ పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఈరోజు రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను సొసైటీ సభ్యులు ముత్తువరపు మురళీకృష్ణ గారితో కలిసి అందజేయడం జరిగింది…

NTR జిల్లా, విజయవాడ, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) ఈ దసరా నవరాత్రులకు విజయవాడలో నిర్వహించబోతున్న విజయవాడ ఉత్సవ్ కు విచ్చేయవలసిందిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఆహ్వానించి, ఈరోజు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ ద్వారా విజయవాడ కళలు, సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా చాటే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలపడం జరిగింది…

కాకినాడ

*దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా పలు దేవీ మండపాలను దర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్*

కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేటలో దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పలు దేవీ మండపాలను దర్శించారు. శెట్టిబలిజి కాలనీలో బి. సూరిబాబు, ఎలుగుబంటి సూరిబాబు సమకూర్చిన విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పద్మనాభనగర్ చెరువు గట్టుపై వెలసిన కనకదుర్గ అమ్మవారి మండపాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రులు శక్తి స్వరూపిణి అమ్మవారి ఆశీస్సులు పొందే పర్వదినాలని, ప్రజలందరికీ అమ్మవారి కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, నీలం శ్రీను, వెలిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం 

అవకాశాలను అందిపుచ్చుకోవాలి: డా. రజని సూచన

స్రికాకుళం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. రజని గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో గురజాడ విద్యాసంస్థలు, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్తంగా నిర్వహించిన యువ కవితా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని, అభివృద్ధి దిశగా నడిపే బాధ్యత వారిదేనని తెలిపారు. జి.వి. స్వామి నాయుడు విద్యార్థులు కళలకు సమయం కేటాయించాలని సూచించగా, కె.వి.జి.డి. బాలాజీ తరగతి గోడలకతీతంగా భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరారు. కె. రమావతి సాహిత్య పరిచయంపై వివరించారు. గజల్ శ్రీనివాస్ పాటలతో యువతకు స్ఫూర్తినిచ్చారు. జంద్యాల శరత్ బాబు, గౌరిశంకర్, ఈ వేమన, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం 

ఇష్టపడి, కష్టపడేతత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చు – గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న సిహెచ్.మహేష్

నరసన్నపేట ,సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) భీమవరంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్. మహేష్ ఉత్తమ ప్రతిభ కనబరచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ ఆర్. రవిచంద్రన్ చేతుల మీదుగా సోమవారం డిగ్రీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు సిహెచ్. వల్లభరావు, రాజేశ్వరి మాట్లాడుతూ మహేష్ చిన్ననాటి నుంచే కష్టపడే తత్వమున్నవాడని, చదువులో ఎల్లప్పుడూ ముందుండేవాడని గుర్తుచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో ప్రతిభ కనబరచి కళాశాలకు, కుటుంబానికి మంచి పేరు తెచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇష్టపడి కష్టపడితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆయన విజయం నిరూపిస్తోందని పేర్కొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.