Tuesday, 5 May 2026

Blog

పశ్చిమ గోదావరి

వీరంపాలెం లో వేడుకగా దసరా వేడుకలు

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కర్రి వెంకట రామకృష్ణారెడ్డి, స్వర్ణప్రద దంపతుల చేతుల ద్వారా కలశస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి దేవిగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. బ్రహ్మశ్రీ వెంకటరమణ శాస్త్రి, శరన్నవరాత్రులు అత్యంత ప్రాముఖ్యమైనవని, భక్తులు పది రోజుల పాటు పీఠ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ దర్శనాన్ని పొందాలని సూచించారు. గ్రామ మహిళా భక్తులు 108 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులకు అన్నప్రసాదం కూడా పంపిణీ చేయబడింది.

పశ్చిమ గోదావరి

కడియద్దలో వేడుకగా శరన్నవరాత్రి మహోత్సవాలు…

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) తాడేపల్లిగూడెం మండలం కడిగడ్డలో శ్రీ బాలా త్రిపుర సుందరి దసరా ఉత్సవ పీఠం వద్ద సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలతో మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలితా సహస్ర పారాయణం, భగవద్గీత చేశారు. నవరాత్రులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

విశాఖపట్నం

దసరా శరన్నవరాత్రుల బాలా త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

గాజువాక, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి): మహా విశాఖ నగర పాలక సంస్థ 87వ వార్డు పరిధిలో కణితి కాలనీల దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ రథాలమ్మ రజక సేవా సంఘం, రదాలమ్మ శెట్టి బలిజి సేవా సంఘం, కాకి మధు ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు, బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం అందింది. వేద పండితులచే వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డ గోవిందా, ఎన్నేటి రమణ, చిత్రాడ రమణ, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, మడక నర్సింగరావు, ఇతర వార్డు నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి దర్శనాన్ని ఆస్వాదించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయ మహల్ సెంటర్ వద్ద బారికేడ్లతో ట్రాఫిక్ రద్దీపై ప్రజల ఆవేదన

నెల్లూరు నగరంలో రద్దీ తగ్గించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ట్రాఫిక్ మరింతగా పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయ మహల్ సెంటర్ పరిసరాల్లో బారికేడ్లు ఉండడం వల్ల రోడ్లు సన్నగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ప్రధాన మార్గమైన పలు హాస్పిటల్స్ కి పోవలసిన ప్రధాన మార్గం ఇదే అవడం వల్ల అత్యవసర వాహనాలు కూడా (అంబులెన్స్, ఫైర్ సర్వీస్) బారికేడ్ల కారణంగా ఆలస్యమవుతున్నాయి. పాదచారులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. మూవబుల్ బారికేడ్లు వాడితే ట్రాఫిక్ ఎక్కువైన సమయంలో వాటిని తొలగించి వాహనాల రాకపోక సులభం చేయవచ్చని సూచిస్తున్నారు.ప్రజలు సూచించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, ట్రాఫిక్ శాఖ సమగ్ర సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రద్దీ తగ్గించడమే కాకుండా, అత్యవసర సేవలకు ఆటంకం రాకుండా చర్యలు చేపట్టాలని నెల్లూరు పౌరులు కోరుతున్నారు.

కర్నూలు

లెదర్ సొసైటీ సహకార సంఘం షేర్ హోల్డర్స్ (సభ్యులకు)కు న్యాయం చేయాలి* . *జై భీమ్MRPS*

* కర్నూలు జిల్లా, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) ఎమ్మిగనూరు పట్టణంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్, లెదర్ సొసైటీ సహకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో షేర్ హోల్డర్లకు న్యాయం చేయాలని ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో ఆఫీస్‌కు మెమోరాండం అందజేశారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగ, జిల్లా నాయకులు ముత్తు సుమాల, సామెల్ మాట్లాడుతూ, కొన్ని వ్యక్తులు దురుద్దేశంతో షేర్ హక్కులను నిర్లక్ష్యం చేసి పరిశ్రమను ప్రైవేటు లీజుకు ఇచ్చారని, షేర్ హోల్డర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెద్ద ముష్టి అబ్రహం మాదిగ, టౌన్ అధ్యక్షులు మడ్రి గుంటేప్ప, ప్రధాన కార్యదర్శి శాంతిరాజు, సభ్యులు మరియు షేర్ హోల్డర్లు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ ఉత్సవ్: హెలికాప్టర్ రైడ్ ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్

NTR జిల్లా సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించారు ఎంపీ కేశినేని శివనాథ్. దసరా, విజయవాడ ఉత్సవాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తులు, సందర్శకులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. నగరాన్ని, కృష్ణమ్మ పరవళ్ళ అందాలను ఆకాశం నుంచి చూడగల అరుదైన అవకాశం అని ఆయన తెలిపారు. ప్రజలకు వినోదం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం కల్పించేందుకు, విజయవాడ ప్రతిష్టను జాతీయ స్థాయికి తీసుకెళ్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు.

తిరుపతి

గూడూరు శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో AMC వ్యవసాయం మార్కెట్ ద్వారా కోట, వాకాడు, చిట్టమూరు మండల పంట పొలాల రోడ్లకు “మహర్దశ”*

* వాకాడు సర్కిల్ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) * గూడూరు నియోజవర్గం శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో..* *కోట, వాకాడు, చిట్టమూరు, మండలాల పంట పొలాలకు లింకు రోడ్లు ఏర్పాటు.**దాదాపు కోటి రూపాయలు నిధులను AMC వ్యవసాయ మార్కెట్ ద్వారా చైర్మన్ దార ప్రమీల గారి ఆధ్వర్యంలో అభివృద్ధి..* *మండలం లోని పలు గ్రామాల రోడ్ల ను పరిశీలించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మాణికల పవన్ కుమార్, తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,* *ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్,* *శంషుద్దీన్ *

పల్నాడు

ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం*

* అమరావతి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. దీని కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు END

పశ్చిమ గోదావరి

నరసన్నపేట యారబాడు గ్రామంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఘన ముగింపు

నరసన్నపేట, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) నరసన్నపేట మండలం యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యుల ఆధ్వర్యంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. డాక్టర్ అమ్మానాయుడు, ఎంపీటీసీ కింజరాపు సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సింహాచలం, టీచర్స్ సురేంద్ర, డిల్లేశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ అమ్మానాయుడు, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ మహిళలకు కూడా ముఖ్యమని, యోగా శరీరం, మనసు, బుద్ధి, ఆత్మకు ఉపయోగకరమని అన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. యారబాడు గ్రామ ప్రజలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టేట్ లెవల్ యోగా గోల్డ్ మెడల్ సాధించిన సుప్రజకు ఘన సన్మానం నిర్వహించారు.

పశ్చిమ గోదావరి

వ్యవసాయ సహకార సంఘం సభ్యురాలికి ఇన్సూరెన్స్ క్లెయిం చెక్కు పంపిణీ

పెనుగొండ: సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) పెనుగొండ వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యుల భద్రతార్థం అమలు చేస్తున్న జనతా ఇన్సూరెన్స్ స్కీం ద్వారా సిరికి ధనలక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె వ్యవసాయ రుణాన్ని సకాలంలో చెల్లించగా, దురదృష్టకరమైన ప్రమాదంలో మరణించటంతో, భర్త గోవిందరావుకు రూ.2,00,000/- విలువైన చెక్కు అందజేయబడింది. ఈ కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ నక్కా వేదవ్యాసశాస్త్రి ప్రధాన అతిథిగా పాల్గొని చెక్కును అందజేశారు. సంఘం డైరెక్టర్లు వేండ్ర మురళి, కానూరి వెంకట సత్యనారాయణ, సీఈవో సుర్నీడి శ్రీరంగ సాయి పవన్ కుమార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ నక్కా వేదవ్యాసశాస్త్రి, ఇలాంటి ఇన్సూరెన్స్ పథకాలు రైతుల ఆర్థిక రక్షణకు ఉపయోగకరంగా ఉంటాయని, భవిష్యత్తులో సంక్షేమ పథకాలు మరింత తీసుకురానున్నారని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.