Tuesday, 5 May 2026

Blog

హైదరాబాద్

కళాశాలలపై చర్యలు *తీసుకోవాలి*

హైదరాబాద్, సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్.సిఐ) అనుమతి లేకుండా బ్యాచ్‌లర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజెస్ కోర్సులు నడుపుతున్న ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య, కోశాధికారి ఆర్. వెంకటేష్ సోమవారం రాష్ట్ర కమిషనర్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. 1992 ఆర్.సిఐ చట్టం ప్రకారం కోర్సులు ఆర్.సిఐ అనుమతితోనే నిర్వహించాలి. గాంధీ, ఉస్మానియా, కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్ కళాశాలలు మూడు సంవత్సరాలుగా అనుమతి లేకుండా కోర్సులు నడుపుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో విఫలమని, 2025-26 నోటిఫికేషన్ ముందు కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

కామారెడ్డి

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

కామారెడ్డి,22 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. : కామారెడ్డి జిల్లా, నర్సన్నపల్లిలో పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో 28 ఏళ్ల యువకుడు ధ్యాప మహేష్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అతను గతంలో దుబాయ్‌లో పని చేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి సాయిలు పెళ్లి కోసం ప్రయత్నించగా ఏదీ ఫలితం ఇవ్వలేదు. గతంలో రెండు సార్లు ఆత్మహత్య యత్నం విఫలమైంది. ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్ళిన మహేష్ మళ్లీ రాలేదని తండ్రి వెతుకగా, రైలు పట్టాల వద్ద మృతదేహం కనుగొన్నారు. రైల్వే అధికారులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం జీజీఎచ్ కు తరలించారు. మహేష్ మృతితో కుటుంబం విషాదంలో మునిగింది; గ్రామస్థులు కుటుంబ బాధను పంచుకున్నారు.

నిర్మల్

కవి జేపీ రావుకు సాహితీ కిరీటి పురస్కారం

నిర్మల్ జిల్లా , సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి) అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ మరియు జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి పురస్కారానికి శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం అధ్యక్షులు కవి ,రచయిత జాధవ్ పుండలికి రావు పాటిల్ ఎంపికచేసి ఆహ్వాన పత్రం పంపారు. ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో ఈ అవార్డు అందజేయనున్నారు. అవార్డుకు ఎన్నికైన జేపి రావుకు కవులు కడారీ దశరథ్, కొండూరి పోతన్న, బసవరాజు, నరసయ్య, జాగిరి యాదగిరి అభినందనలు తెలిపారు.

నిర్మల్

భైంసా గట్టు మైసమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడింది

నిర్మల్ జిల్లా , సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి) భైంసా పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గట్టు మైసమ్మ ఆలయంలో పూజా–ఆరతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పశువైద్య రిటైర్డ్ అధికారి, రాష్ట్ర ఎనిమల్ హజ్ బెండ్రీ డైరెక్టర్ డాక్టర్ పోశెట్టి, డాక్టర్ నాగేశ్, ఆలయ కమిటీ పెద్దలు గట్టు, మహేష్, పోషట్టీ, స్వామి, జగదీష్, కోర్వసచిన తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్సాహభరితంగా పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ ఉత్సవం స్థానికంగా భక్తుల మరియు కమ్యూనిటీ కోసం సాంప్రదాయానుసారంగా ఘనంగా జరిగింది.

కడప

కోనేరులో బ్లీచింగ్ పౌడర్ పిచికారి

సిద్దవటం,సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి) సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామ సమీపం లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజయ్య స్వామి కోనలోనలోని పంచలింగాల గుడి సమీపాన ఉన్న కోనేరులో సోమవారం దేవాదాయ శాఖ సిబ్బంది చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేశారు.కోనకు వచ్చే భక్తులకు దాహం తీర్చేందుకు ఈ కోనేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆలయ ఈవో శ్రీధర్ పర్యవేక్షణలో నీటి గుండం శుభ్రం చేశారు.

కడప

వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు -పి.ఆర్.బి ఆధ్వర్యంలో విశేష పూజలు

సిద్ధవటం,సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ సాయి నగరులో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో శ్రీ విజయదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విగ్రహ దాత పుత్తా రామభద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడ్డాయి. దసరా శరన్న నవరాత్రుల ఏడవ వార్షికోత్సవంలో పి.ఆర్.బి హ్యాండ్లూమ్ అధినేత పుత్తా రామభద్రయ్య కుమారులు పుత్తా బాబు, నాగభూషణం సంఘటనకు ఆధ్వర్యం వహించారు. ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ, ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల కుటుంబ, వ్యాపార సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

తూర్పు గోదావరి

కుమారదేవం లో విజయ దుర్గఅమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్22) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో విజయదుర్గ అమ్మవారి 14వ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నాయి. వాటర్ ట్యాంక్ వీధిలోని మండపంలో పురోహితుడు వెలవెల పల్లి ప్రకాశరావు వేద మంత్రాలతో విగ్రహ ప్రతిష్ట చేశారు. విగ్రహ దాత వీర్రాజు దంపతులు, కుటుంబ సభ్యులు వైభవంగా కార్యక్రమాన్ని నిర్వాహించారు. అమ్మవారిని ఊరేగింపుగా గ్రామంలో తీసుకువచ్చి మండపంలో ప్రతిష్టించారు. కుల మతాలకు అతీతంగా మహిళా భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 14 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలచే ప్రారంభమైన ఈ మహోత్సవాలు అమ్మవారి దయతో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకతగా, చీరను వేలం పాటలో భక్తులు గెలిచి కోరికలు నెరవేరాలని నమ్మకం ఉంది

ఎలూరు

అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

రెడ్డిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రెడ్డిగూడెం గ్రామంలోని రజకుల బజారులో దేవీ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ప్రతిష్టించడం జరిగింది ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ పవిత్రమైన వేడుకలో పాల్గొనడం గొప్ప కార్యక్రమమని అమ్మవారి అనుగ్రహం అందరికీ అన్నివేళలా ఉండాలని ఆకాంక్షించారు భక్తులు కమిటీ వారు సమన్వయంతో సేవా భావంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా వారు ఆకాంక్షించారు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో రజక సంఘాల నాయకుడు లచ్చ రావు గారు మరియు కమిటీ సభ్యులు యువకులు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది

Featured

బెంగళూరు నుండి 3.61 లక్షల విరాళం: పవన్ కల్యాణ్ “ఓజీ” క్రేజ్ రాజకీయ మద్దతుగా

సెప్టెంబర్ , పున్నమి ప్రతినిధి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ “ఓజీ” సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి అభిమానులు జనసేన పార్టీకి విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరు అభిమానులు రూ. 3.61 లక్షలు, చెన్నై నుండి 1.72 లక్షలు, చిత్తూరు నుంచి 1 లక్ష చొప్పున విరాళాలు అందజేశారు. విరాళాలను ఎమ్మెల్సీ నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. అభిమానులు తమ నటుడి సినిమాను రాజకీయ మద్దతుగా కూడా ఉపయోగిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటించారు. సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది.

పశ్చిమ గోదావరి

వీరంపాలెం లో వేడుకగా దసరా వేడుకలు

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కర్రి వెంకట రామకృష్ణారెడ్డి, స్వర్ణప్రద దంపతుల చేతుల ద్వారా కలశస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి దేవిగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. బ్రహ్మశ్రీ వెంకటరమణ శాస్త్రి, శరన్నవరాత్రులు అత్యంత ప్రాముఖ్యమైనవని, భక్తులు పది రోజుల పాటు పీఠ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ దర్శనాన్ని పొందాలని సూచించారు. గ్రామ మహిళా భక్తులు 108 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులకు అన్నప్రసాదం కూడా పంపిణీ చేయబడింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.