Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆదేశాల అమలుపై విద్యాశాఖాధికారుల దిశానిర్దేశం

నరసన్నపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు ఆధ్వర్యంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో 22-09-2025 (సోమవారం)న సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, దసరా సెలవులలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా డ్రాప్ అవుట్ డేటా, ఆపార్ పెండింగ్ డేటాను తక్షణమే ఆన్లైన్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రగతికి చదువుతో పాటు లౌకిక జ్ఞానం అందించే విధంగా, సామాజిక స్పృహ పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలలో రూపకల్పన చేయాలని సూచించారు.

కామారెడ్డి

టీఎస్ పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా శాఖ కు రిలీఫ్ ఫండ్ కు విరాళం

కామారెడ్డి, 22 సెప్టెంబర్,పున్నమి ప్రతినిధి : ఊహించని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలకు సహాయంగా, తెలంగాణ పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ రూ.7,06,011 విలువైన డీడీని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌కి అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ సంఘ సభ్యులను అభినందించారు. పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యలతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యం అవుతున్నామన్నారు. పాఠశాలలు దత్తత, రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, టిఆర్టియు నేతలు, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు తోడ్పడిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

జనగాం

శ్రీబాల త్రిపురసుందరిదేవిగా అమ్మ వారి కి ప్రత్యేక అలంకరణ

జనగామ/పాలకుర్తి ,సెప్టెంబర్ , పున్నమి ప్రతినిధి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం గుడివాడ చౌరస్తాలో గుడివాడ విగ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాటుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సోమవారం మొదటి రోజు శ్రీబాలత్రిపురసుందరిదేవిగా అమ్మవారిని అలంకరించి అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ ఆశీర్వాదంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. అమ్మవారికి నవరాత్రులు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు

తిరుపతి

జిఎస్టి (GST) సవరణలపై ర్యాలీ

శ్రీకాళహస్తి పట్టణం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చే నూతనంగా అమలు చేసిన జీఎస్టీ స్లాబులపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన పెంచుటకు మరియు సామాన్య ప్రజలకు రోజు నిత్య వసర కొనుగోలు వస్తువులపై భారీగా జీఎస్టీ పన్నులను తగ్గించిన నరేంద్ర మోడీ మరియు శ్రీమతి నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలుపుతూ,స్థానిక బేరివారి మండపం వద్ద ర్యాలీ నిర్వచించడం జరిగింది.

యాదాద్రి భువనగిరి

దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన

యాదాద్రి భువనగిరి జిల్లా ,సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి ఈరోజు హైదరాబాద్ చౌరస్తా సవర్కా దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి ప్రతిష్టాపన పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో బ్రాహ్మణులు అష్టోత్తర పూజలు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మాయ దశరథ పాల్గొన్నారు. పూజల్లో భరద్వాజ్, నరసింహ, శ్రీకాంత్, నాగరాజు, ఇతరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందారు.

సాహితీ

కవి పాత్రికేయుడు సింహాద్రి శ్రీనివాస్ రావు కు సాహితీ కిరీటి పురస్కారం

జయపురం ,సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి; అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి పురస్కారానికి పాత్రికేయుడు కవి ,రచయిత సింహాద్రి శ్రీనివాస్ రావు కు ఎంపికచేసి ఆహ్వాన పత్రం పంపారు. ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో ఈ అవార్డు అందజేయనున్నారు. అవార్డుకు ఎన్నికైన సందర్భంగా సాహిత్య మిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందనలు తెలిపారు.

రంగారెడ్డి

నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎల్ బి నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా , సెప్టెంబర్ , పున్నమి ప్రతినిధి అబ్దుల్లాపూర్ మెట్టు మండలం హయత్ నగర్ డివిజన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారా కాలనీ పూర్తిగా నీట మునిగింది. స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. వాతావరణ శాఖ సూచన మేరకు మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. వరద నీటిని మరలించే చర్యలు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

హనుమకొండ

భద్రకాళి అమ్మవారిని,పద్మాక్షి అమ్మవారిని,రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే,ఎంపీ *శరన్నవరాత్రి ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని,ఎంపీ కావ్య

పున్నమి ప్రతినిధి హన్మకొండ సెప్టెంబర్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి మరియు అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారి, వేలి స్తంభాల రుద్రేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి వెలిగించి నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. భక్తులు సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతినిధులు, భక్తులు, నాయకులు ఘనంగా పాల్గొన్నారు.

హనుమకొండ

భద్రకాళి అమ్మవారిని,పద్మాక్షి అమ్మవారిని,రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే,ఎంపీ *శరన్నవరాత్రి ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని,ఎంపీ కావ్య

పున్నమి ప్రతినిధి హన్మకొండ సెప్టెంబర్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి మరియు అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారి, వేలి స్తంభాల రుద్రేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి వెలిగించి నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. భక్తులు సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతినిధులు, భక్తులు, నాయకులు ఘనంగా పాల్గొన్నారు.

హనుమకొండ

*కాజీపేట సోమిడి తాళ్ళ పద్మావతి హై స్కూల్‌లోఅంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు*

(పున్నమి ప్రతినిధి) కాజీపేట సెప్టెంబర్: కాజీపేట సోమిడి తాళ్ల పద్మావతి హై స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఆహ్లాదకరంగా, అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల ఆవరణ పూల సువాసనలతో, విద్యార్థినుల పాటలు, నృత్యాలతో సందడిగా మారింది. పాఠశాల కరెస్పాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ పూల పండుగను ప్రారంభించి, సాంప్రదాయాలు, సంస్కృతిని విద్యార్థులు తెలుసుకోవడం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు పాడి నృత్యాలు చేశారు. చిన్నారుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయులు ఈ ఉత్సవాలు విద్యార్థుల్లో సాంఘిక చైతన్యం, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించడంలో ఉపయోగకరమని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.