Tuesday, 5 May 2026

Blog

కడప

బేకరిలకు లైసెన్సులు తప్పనిసరి

23సెప్టెంబర్ 25 నా పులివెందుల పట్టణము లో బెస్ట్ బేకరి నీ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత , మున్సిపల్ కమిషనర్ రాముడు మున్సిపల్ అధికారులతో కలిసి బేకరీ ని పరిశీలించారు. బేకరీలోని కేకులు , గులాబ్ జామ్, బిస్కెట్ మరియు తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. బేకరీలో ఉన్న ఆహార పదార్థాలను ల్యాబ్ కి పంపామని చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకా తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత చెప్పారు. బెస్ట్ బేకరి లో నిన్న అనగా 22/09/2025 బర్త్ డే కేక్ కట్ చేస్తే బూజు పట్టి ఉందని కంప్లైంట్ వచ్చిందని , అందుకే ఈరోజు తనకి జరిపేమని ఆమె అన్నరు. పట్టణము లో అనుమతి(లైసెన్సులు) లేకుండా నడిపే బేకరి లు ఉంటే వెంటనే అనుమతులు (లైసెన్సులు)తీసుకోవాలని లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నంద్యాల

నంద్యాల జిల్లాలో వీఆర్ఐ టిటిఐ బృందం ప్రకృతి వ్యవసాయ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై లోతైన అవగాహన కోసం కర్నాటక రాష్ట్రం,బెంగుళూరు సిటీ, వీఆర్ఐటిటిఐ సంస్థ నుండి వచ్చిన 04 మంది సభ్యులు నంద్యాల జిల్లాలో మంగళవారం పర్యటించారు. వీఆర్ఐటిటిఐ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం, స్వయం సమృద్ధి మరియు జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేసే సంస్థ.ఈ సంస్థ గ్రామీణ కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు,నైపుణ్య శిక్షణ,వ్యవసాయం-ఆధారిత ప్రోత్సాహక చర్యలు,మరియు మార్కెట్ లింకేజీలు అందిస్తూ, ప్రధానంగా ఎస్ హెచ్ జి ఎస్ , ఎఫ్ పి ఓ ఎస్,యువత, మహిళలను బలోపేతం చేసి, స్థిరమైన ఆదాయం,మరియు గౌరవప్రదమైన జీవన విధానం సాధించడానికి దోహదపడుతుంది. వీఆర్ఐటిటిఐ కృషి వలన అనేక కుటుంబాలు శాశ్వత జీవనోపాధి అవకాశాలు పొందుతూ ఆర్థిక భద్రతను అందుకుంటున్నాయి.ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా ఏడీపీఎం అబ్దుల్ సలాం నేతృత్వంలో వీఆర్ఐటిటిఐ బృందం నంద్యాల జిల్లాలోని పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి,ఇక్కడి రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను తెలుసుకున్నారు.ముందుగా ప్యాపిలి మండలం,బావిపల్లి, నేరెడుచెర్ల యూనిట్లకు చెందిన ఐసీఆర్పీలు కలిసి సాగు చేస్తున్నటువంటి ఏటియం (ఎనీ టైం మనీ) మోడల్ను పరిశీలించారు. 1.20 ఎకరాల విస్తీర్ణంలో 18 రకాల పంటల వైవిధ్యంతో సాగు చేస్తున్న విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను రైతు ఎలా అనుసరిస్తున్నారో, పంటల ఎంపికలో ఆయన అనుసరించిన పద్ధతి ని బృందం సభ్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పంటల వైవిధ్యాన్ని,దాని ద్వారా సాధిస్తున్న విజయాలను బృందం ఎంతగానో మెచ్చుకుంది. ఆ‌ తర్వాత అదే గ్రామంలో జలదుర్గం ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జ్ వెంకటప్ప సాగు చేస్తున్న ఏ-గ్రేడ్ కంది పంటను బృందం వీక్షించింది.వెంకటప్ప అనుసరిస్తున్న అంతర పంటలు,సరిహద్దు పంటల ప్రయోజనాలను బృందం తెలుసుకుంది.వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో రైతు వివరించారు.పలు పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సాధ్యమవుతుందని బృందం అభిప్రాయపడింది. తదుపరి,జలదుర్గం గ్రామంలో మహిళా సంఘాల(ఎస్ హెచ్ జి)సభ్యులతో వీఆర్ఐటిటిఐ బృందం సమావేశమైంది.ఈ సందర్భంగా మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల తమ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని,తక్కువ ఖర్చుతో పంట దిగుబడులు సాధ్యమయ్యాయని వారు వివరించారు.అలాగే గృహోపయోగానికి అవసరమైన కూరగాయలను తాము స్వయంగా పండించుకోవడం వల్ల ఖర్చు తగ్గిందని,ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. తరువాత క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీఆర్ఐటిటి ఐ బృందం,కేడర్ సభ్యులు తమ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారో,రైతులతో వారు ఎంత సమీపంగా పని చేస్తున్నారు,శిక్షణలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే అంశాలను తెలుసుకున్నారు. ఈ ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో వీఆర్ఐటిటిఐ బృందం సభ్యులు రాగిని,రఘు, సందీప్, శరత్ తో పాటు,రైతు సాధికార సంస్థ, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ జలాలుద్దీన్,ప్రకృతి వ్యవసాయ అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అబ్దుల్ సలాం,యం.యం.టి.యల్ భీమేష్, ఎన్.ఎఫ్.ఎ సునంద,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యమ్.టి లు,యూనిట్ఇన్చార్జ్లు,ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

కడప

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన విద్యుత్ ఎస్ ఈ తో చర్చలు.సి ఐ టి యు

కడప జిల్లా విద్యుత్ ఎస్ ఈ తో కడప నగరంలోని విద్యుత్ భవనంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చలు జరిగినవి, ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ పైడ్ హాలిడేస్ ఇస్తామని అన్ని డివిజనులకు బడ్జెట్ పంపమని చెప్పారు.,ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ ఐటిఐ విద్యార్హతలు ఉన్న వారి పేర్లు కోర్టు కు వెళ్లిన కార్మికులకుకోర్టుకుపోకపోయినా లిస్టు తయారు చేసి పాత ఆపరేటర్ తో సమానంగా జీతాలు ఇవ్వాలని సీఎండి తిరుపతి గారికిపంపిస్తామని చెప్పడం జరిగింది జిల్లావ్యాప్తంగా ప్రొద్దుటూరు డివిజన్ మైదుకూరు డివిజన్ కడప, పులివెందుల సబ్ స్టేషన్ పరిధిలోని మోటర్లు బోర్లు కాంపౌండ్ వాల్ ఫినిషింగ్లు సేఫ్టీ మెటీరియల్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తొందరగా పని అయ్యేటట్లు చేస్తానని అలాగే కంట్రోల్ రూమ్లు మైదుకూరు డివిజన్లోనిముత్తులూరుపాడు వరికుంట్ల కా లవకట్ట పని మొదలు పెట్టాలని చెప్పారు.పులివెందుల డివిజన్లోని ప్రతి కాంట్రాక్టు కార్మికునికి పెయిడ్ హాలిడేస్ఇవ్వాలని ఇప్పటికే ఒకరికి ఇస్తున్నారు మిగతా అందరికీ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇస్తామని చెప్పారు.డి అగ్రహారం నరసింహారెడ్డికి ఒక సంవత్సరం పాటు రావలసిన జీతం కాంట్రాక్టర్తో మాట్లాడి ఇస్తామని చెప్పినారు.ప్రతి సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ ఉండాలని సిఎండి గారికి లెటర్ పంపుతాననిచెప్పారు.అక్టోబర్ ఫస్ట్ వీక్ లోఅవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇన్సూరెన్స్.మన శాలరీలో జీతాలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని ఇతర కార్డులు ,కార్మికుడికి భద్రతగా ఇన్సూరెన్స్ చేపించాలని అడిగినాము త్వరగా ఎస్సీ స్పందిస్తూ బ్యాంకు వారితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు ఈ చర్చల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మైదుకూరు డివిజన్ కార్యదర్శి పి సి కొండయ్య పులివెందుల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్రెడ్డి చంద్రమౌళి ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా నాయకులు నబి రాయుడు అధికారులు పర్సనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు గారు జ ఎ ఓ జగన్మోహన్ రెడ్డి చర్చల్లోపాల్గొన్నారు.అన్ని విషయాలు చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పిన ఎస్సీ వెంకట్ రమణ గారికి ధన్యవాదాలుతెలియజేస్తున్నాము.ఈ సమస్యలకు అక్టోబర్ 10 వ తారీకు లోపు పరిష్కరించకపోతే సిఎండి కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం అని తెలిపారు

కడప

యు సి ఐ ఎల్ సమస్యలను పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

యు సి ఐ ఎల్ లో సమస్యలను పరిష్కరించి,పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు,పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశంనిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్.చెరుకూరిమాట్లాడుతూ.యుసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ,ఇతర సమస్యలు తలెత్తకుండాపరిష్కరించాలని పులివెందుల ఆర్డీవోను ఆదేశించారు.ప్రాజెక్టు పరిధిలోని పునరావాసం కోరుతున్న కే కే కొట్టాల గ్రామాల ప్రజలు రైతులతో మాట్లాడి సమస్యలను సామరస్యంగాపరిష్కరించాలన్నారు.గతం లో ప్రాజెక్టు కోసం మంజూరైన భూములను త్వరతిగతిన వారికిఅప్పజెప్పాలన్నారు.ప్రాజెక్టునిర్వహణ,భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వంవహించారాదన్నారు.యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండాచూడాలన్నారు.యురేనియం ప్రాజెక్టు (టైలింగ్)వ్యర్థపదార్థాల నిల్వలు,స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారుఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్,,యుసీఐఎల్ సూపర్డెంట్ నవీన్ రెడ్డి.పులివెందుల ఆర్డిఓ చిన్నయ్య ఆర్ అండ్ బి డిఈ మాధవి,రెవెన్యూ అధికారులు,పర్యావరణ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు డిగ్రీ కళాశాలలో ఘనంగా “10వ ఆయుర్వేదిక్ దినోత్సవం”

రైల్వే కోడూరు, సెప్టెంబర్ 23: పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10వ ఆయుర్వేదిక్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “ఆయుర్వేదం అనేది ప్రాచీన కాలం నుండి మన పూర్వీకుల ఆచారంలో భాగం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, దీర్ఘాయుష్షు పొందడంలో ఆయుర్వేదానికి అపారమైన ప్రాధాన్యం ఉంది” అని తెలిపారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకుడు డాక్టర్ కె. రమేష్ గారు, “ఆయుర్వేదంలో ఉన్న రోగనిరోధక శక్తి ప్రభావం వల్ల శరీరానికి రక్షణ లభిస్తుంది” అని వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ, “మన పూర్వీకులు ఆయుర్వేదం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నారు, ఆయుష్షును పెంచుకున్నారు” అని అన్నారు. రసాయన శాస్త్ర ఉపన్యాసకుడు శ్రీ కె. పి. కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, “వనమూలికల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోగ నివారణ మాత్రమే కాక, శరీర బలపరచుకోవడం కూడా సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్‌.ఎస్‌.ఎస్‌ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఆయుర్వేద దినోత్సవాన్ని అర్థవంతంగా జరిపారు.

అన్నమయ్య

కార్మికుల పనిగంటల పెంపు చట్టాన్ని ఉపసంహరించాలి: సిఐటియు డిమాండ్

రైల్వేకోడూరు: ధరల పెరుగుదలకి అనుగుణంగా జీతాలు పెంచాల్సిన చోట, కూటమి ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం దుర్మార్గమని, ఇది కార్మికులకు జరిగిన పెద్ద ద్రోహమని అన్నమయ్య జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు ఆర్. వెంకటేష్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, రాష్ట్రంలోని టిడిపి–జనసేన–బిజెపి కూటమి యధాతధంగా అమలు చేస్తోందని వారు ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేసి, కనీస చర్చ లేకుండా అసెంబ్లీలో కార్మిక వ్యతిరేక తీర్మానం ఆమోదించారని మండిపడ్డారు. ప్రస్తుత ఎనిమిది గంటల విధానం స్థానంలో 12 గంటలు పనిచేయించుకోవచ్చని చట్టం చేయడమే కాక, ఐదు గంటల పనికి గంటసేపు విరామం, వారానికి 48 గంటల బదులు 60 గంటలు, ఓవర్‌టైమ్‌ను 75 గంటల నుంచి 144 గంటలకు పెంచటం యజమానులకు అనుకూలమైన చర్యలని విమర్శించారు. 64 సంస్థల కనీస వేతనాలను 15 ఏళ్లుగా సవరించని ప్రభుత్వం, ఇప్పుడు కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అంతేకాక, మహిళలను రాత్రి షిఫ్ట్‌లకు అనుమతించడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వారి జీవన పరిస్థితులు, ఆదాయం, వేతనాల పెంపు వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చే జరగకపోవడం కార్మిక వర్గంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందన్నారు. పెట్టుబడిదారుల పార్టీల పట్ల కార్మికులు మోహం వదిలి, పూర్వీకులు పోరాడి సాధించిన హక్కులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, ఓబులవారిపల్లి మండల నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించిన ఆయుర్వేద దినోత్సవం

రైల్వే కోడూరు, సెప్టెంబర్: (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు 10వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రాచీన వైద్య పద్ధతి అని, ఇది మానవ ఆరోగ్యానికి అపారమైన మేలుచేస్తుందని పేర్కొన్నారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకుడు డాక్టర్ కె. రమేష్ ఆయుర్వేద అవసరం మరియు రోగ నిరోధక శక్తిపై ఉపన్యాసం ఇచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మన పూర్వీకులు ఆయుర్వేదం ద్వారా ఆయుష్షు పెంచుకున్నారని వివరించారు. రసాయనశాస్త్ర ఉపన్యాసకుడు శ్రీ కె.పి. కృష్ణమూర్తి వన మూలికల వైద్య ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల యన్.యస్.యస్. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

నిర్మల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు – ప్రజల్లో భయాందోళనలు, పంటలకు భారీ నష్టం నిర్మల్ జిల్లా అంతటా గత కొన్ని రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం రాత్రి వేళల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కారణంగా ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకొని, గాలులు వీచి, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తించింది. రాత్రి సమయంలో పిడుగులు తరచుగా పడుతుండటంతో గ్రామాలు, పట్టణాల ప్రజలు ఇళ్లలోనే తలదాచుకుని భయంతో గడిపారు. వర్షాల తీవ్రత కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి పంటలు తడిసి నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కార్మిక వ్యయాలతో ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు కురుస్తున్న నిరంతర వర్షాలు వారి ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పాటు పిడుగులు పడటంతో పశువులు కూడా మేత దొరకక ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పశువులు గాయపడ్డాయన్న సమాచారం కూడా అందుతోంది. వర్షాల ప్రభావంతో రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులు, వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. పిడుగులు పడటం వల్ల కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాలు చీకట్లో మునిగిపోయాయి. ప్రజలు భయంతో తమ ఇళ్లలోనే జాగ్రత్తగా గడుపుతున్నారు. బయట పనుల కోసం వెళ్లడానికీ భయపడుతున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, ప్రతిసారీ ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు ఇళ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు కన్నీళ్లతో భయపడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వర్షాలు కొనసాగితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచనలు జారీ చేశారు. పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, చెట్ల క్రింద, ఓపెన్ ప్రదేశాల్లో నిలబడవద్దని, పొలాల్లోకి వెళ్ళే ముందు జాగ్రత్తలు పాటించాలన్న సూచనలు ఇచ్చారు. నిర్మల్ జిల్లా ప్రజలు వర్షాల నుండి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ వర్షాల దెబ్బకు పంటలతో పాటు పశువుల జీవనాధారం కూడా కష్టాల్లో పడిపోగా, జనజీవనం అస్తవ్యస్తమైంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ధన్వంతరి జయంతి

– ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోడాక్టర్ సురేష్ బాబు ఆద్వర్యాంలో  ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ సురేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సంద ర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ, ఆయుర్వేద మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించి తమ ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసు పత్రిలోనే ఆయుర్వేద మందులు అందుబా టులో ఉన్నాయని చెప్పారు.మండల ప్రజలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్య క్రమం అనంతరం, ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వ హించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, డాక్టర్ సురేఖ, రమ్య, జానకమ్మ, పవన్, శ్రీధర్, రాజు, కవితతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆదేశాల అమలుపై విద్యాశాఖాధికారుల దిశానిర్దేశం

నరసన్నపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు ఆధ్వర్యంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో 22-09-2025 (సోమవారం)న సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, దసరా సెలవులలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా డ్రాప్ అవుట్ డేటా, ఆపార్ పెండింగ్ డేటాను తక్షణమే ఆన్లైన్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రగతికి చదువుతో పాటు లౌకిక జ్ఞానం అందించే విధంగా, సామాజిక స్పృహ పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలలో రూపకల్పన చేయాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.