Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఉపాధి కోసం బైరాన్ వెళ్ళిన తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి

 కామారెడ్డి,23 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి   : కామారెడ్డి జిల్లా మెరుగైన ఉపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్ళిన కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండ లం, చుక్కాపూర్ గ్రామానికి చెందిన కావటి చిన్న ఎల్లయ్య (46) గుండెపోటుతో మరణించాడు. గత ఏడాది నుంచి తెలంగాణలో సరైన ఉపాధి అవకా శాలు లేకపోవడంతో, కూలీ పని కోసం ఎల్లయ్య బహ్రెయిన్ వెళ్ళాడు. బహ్రెయిన్‌లోని ఒక ఎస్టీఎస్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్న ఎల్లయ్య, అక్కడ  అదృష్టం కలిసిరాలేదు,  తీవ్ర మనోవేదనకు గుర య్యాడు.సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చలే కపోతున్నానని తరచుగా తన సహచరులతో చెప్పుకుని బాధపడేవాడని ఎన్నారై వెంకటస్వామి తెలిపారు.ఈనేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని భావిస్తున్నారు.మృతదేహం స్వదేశానికి పంపించేందుకు ఎన్నారైల సహకారం..ఎల్లయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు బహ్రె యిన్‌లోని ప్రవాస భారతీయుల సంఘం (ఎన్నారై ల సంఘం) సహాయపడింది. మృతదేహాన్ని హైదా రాబాద్‌కు పంపించే ఏర్పాట్లు వారు చేశారు. ఈ సంఘటనపై ఎన్నారై వెంకటస్వామి స్పందిస్తూ, నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లయ్య మృతి బాధాకరమన్నారు.వెంటనే బాదీత కుటుబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిందని గుర్తు చేస్తూ, ఈ నిబంధనల కింద ఎల్లయ్య కుటుంబా నికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు..

హైదరాబాద్

జీవో నం.190 లో స్థానికత పై ప్రభుత్వం స్పందించాలి.. 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు… 27న చలో హైదరాబాద్కు పిలుపు..

పున్నమి: జీవో నెంబర్ 190 లో స్థానికతపై ప్రభుత్వం స్పందించాలని 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు కోరారు.జీవో నం. 370 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితులకు తాత్కాలిక డిప్యూటేషన్ల కై ఉపశమనం కొరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 190 ను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో 317 జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 27న చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 190 లో స్థానికతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, డిప్యూటేషన్ జీవో 190 లో కూడా స్థానికత లేదనే విషయం పైన స్పందించాలని కోరారు. ఈ జీవో ద్వారా తాత్కాలిక డిప్యూటేషన్ లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ చేయబడ్డ పండిట్, పీఈటీ లకు ఈ జీవో వల్ల ఎలాంటి లబ్ధి చేకూరడం లేదన్నారు. క్లియరెన్స్ వేకెన్సీ లో మాత్రమే బాధితులకు అవకాశం కల్పిస్తామని చెప్పడం తో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 317 బాధితులు అందరికీ న్యాయం జరిగేలా శాశ్వతంగా వారి సొంత జిల్లా జోన్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 317 జీవో బాధితులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు ఐలయ్య, పృథ్వి, జ్యోతి, సాయి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్‌లో విజయదశమి వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలో పూసలకోనేరు దగ్గర బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్‌లో విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ జి.రామారావు దీపప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించారు.ఈ వేడుకలో చైర్మన్ కె.మనోహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చూపుతున్న దూరదృష్టి,నిరంతర ప్రోత్సాహం పాఠశాల అభివృద్ధికి ప్రధాన బలమని అందరూ ప్రశంసించారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. జి.గీతామనోహర్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఎస్కార్ట్ విధుల్లో అప్రమత్తత తప్పనిసరి” – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్

“ ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఎస్కార్ట్ సమయంలో నిందితుడు పరారైన సంఘటన నేపథ్యంలో, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్, లా అండ్ ఆర్డర్ సిబ్బందికి కఠిన సూచనలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ఎస్కార్ట్ విధులకు బయలుదేరే ముందు నిందితులపై నమోదైన కేసులు, వారి నేర చరిత్ర, నేరాల తీవ్రత గురించి సిబ్బందికి అధికారులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కోర్టు కానిస్టేబుల్స్, ఎస్కార్ట్ పోలీసులు, జైలు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ముద్దాయిని చట్టప్రకారం సంకెళ్లతో భద్రంగా బంధించడం తప్పనిసరి. రిమాండ్ ఖైదీలు, కరడుగట్టిన నేరస్థులు, పునరావృత నేరస్తుల విషయంలో అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎస్కార్ట్ వాహనం మధ్యలో ఆగిన సందర్భంలోనూ, ముద్దాయిపై నిరంతరం నిఘా ఉంచాలి. ముద్దాయి అవసరాల నిమిత్తం వాహనం ఆపినపుడు కనీసం ఇద్దరు సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే, ఎస్కార్ట్ బాధ్యతల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ స్పష్టం చేస్తూ… “ముద్దాయిల ఎస్కార్ట్ విధులు అత్యంత అప్రమత్తతతో, చట్టబద్ధతతో, వృత్తి నిబద్ధతతో నిర్వహించాలి. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబడదు” అని తెలిపారు.

తిరుపతి

13 గంటలు వద్దు-8 గంటలే ముద్ద:సీఐటీయూ

శ్రీకాళహస్తి:కార్మికులు, ఉద్యోగుల చట్టబద్ధ హక్కు 8 గంటల పని దినాన్ని 13 గంటలుగా మార్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.13గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక,ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయనీ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు దాసోహం అయ్యాయి అనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు.కార్మికులను కట్టు బానిసలుగా మార్చే13గంటల పని విధానంపై కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపశమహరించుకోకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

తూర్పు గోదావరి

ప్రైవేటీకరణకు పిపిపికి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారు

ప్రైవేటీకరణకు…. పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారు – ఈ పీపీపీ పద్దతి అనేది కొత్తగా మన రాష్ట్రంలోనే లేదు – రాజమండ్రి మెడికల్‌ కళాశాలకు వారు ఖర్చు చేసింది రూ. 10 కోట్లు మాత్రమే – మనం ఈ 15 నెలల్లో రూ. 32 కోట్లు ఖర్చు చేశాం – ప్రభుత్వాసుపత్రికి సూపర్‌ స్పెషాలిటీ సర్వీసులు కావాలి – మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయోద్దు – వైకాపా వారికి సూచన – అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం : గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులు మెడికల్‌ కళాశాలల ప్రస్తావన తీసుకువచ్చి ప్రైవేటీకరణ అంటూ రాద్దాంతం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రైవేటీకరణకు… పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారని, అటువంటి వ్యక్తులు ప్రతిపక్ష హోదా అడగడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఈ పీపీపీ విధానం ఏదో మన ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు కానీ… ఇప్పటికే కస్తూరిభా మెడికల్‌ కళాశాల (బెంగుళూర్‌) ఇది పీపీపీ మోడ్‌లో నడుస్తోందన్నారు. దానితో పాటు శాంతి నికేతన్‌ మెడికల్‌ కళాశాల (పశ్చిమ బెంగాల్‌) పీపీపీ మోడ్‌లో నడుస్తోందని, త్రిపుర మెడికల్‌ కళాశాల త్రిపుర, అలాగే కర్ణాటకలో 11 మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించి అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. గతంలో వైకాపా వారు చేసిన తప్పులు… తీసుకున్న అప్పులు తీసుకువచ్చి తిరిగి చెల్లించకపోవడం వల్ల మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. రాజమహేంద్రవరంలోని మెడికల్‌ కళాశాల విషయానికి వస్తే వైకాపా అధికారంలో ఉన్న సమయంలో దాని కోసం వారు రెండేళ్లల్లో ఖర్చు చేసింది కేవలం రూ. 10 కోట్లు అయితే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే ఖర్చు చేసింది రూ. 32 కోట్లని వివరించారు. ప్రస్తుతం 3వ ఏడాది విద్యార్ధులు వచ్చారని… వారు వచ్చే సమయానికి అక్కడ జి ప్లస్‌ 5 కింద బాయ్స్‌ అండ్‌ గాల్స్‌ ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో బ్లాక్స్‌ నిర్మాణం చేయని స్థితిలో ఉన్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ. 20 కోట్లతో నిర్మాణాలు చేసుకుని విద్యార్ధులకు వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వైకాపా వారు కళాశాలకు శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోయారు కానీ…. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న మెడికల్‌ కళాశాలకు, తాత్కాళిక మెడికల్‌ కళాశాలకు కూత వేటు దూరంలో ఉన్న ఆర్‌ అండ్‌ బి అతిధి గృహం వద్ద ఆర్‌ అండ్‌ బి స్థలంలో వైకాపా వారు రాజ్‌ మహాల్‌ను తలపించేలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం, దాని వెనుక నుంచి హెలీప్యాడ్‌కు దారి నిర్మించుకోవడం కూడా జరిగిందని ఎద్దేవా చేశారు. అలాగే వైకాపా వారి నిర్లక్ష్యం కారణంగా మరుగునపడిపోయిన అల్లు రామలింగయ్య హోమియో కళాశాలకు చెందిన 23 పీజి సీట్లను మంత్రి సత్య యాదవ్‌తో మాట్లాడి కళాశాల యాజమన్యంతో ఢల్లీిలోని సంబంధిత శాఖామాత్యుల వారికి ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి వారి సహకారంతో వినతి పత్రం ద్వారా తెలియచేసి ఆ సీట్లను సాధించుకోగలిగామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ఇలా చేయడం వల్ల గుడివాడ, కడప హోమియో కళాశాలల్లో కూడా పీజీ సీట్ల పునరుద్ధరణ జరిగింద్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి రోజుకు 500 నుంచి 600 ఓపీ ఉండగా మనం అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు సుమారు 1800లకు పెరిగిందన్నారు. అయితే ఆసుపత్రికి సూపర్‌ స్పెషాలిటీ సర్వీసులు అవసరం ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌. ఐఎంఎ వారి సహకారంతో ప్రస్తుతం ఆ సర్వీసులు అందిస్తున్నామని, అయితే సంబంధిత శాఖామాత్యులు ఈ విషయంపై దృష్టి పెట్టి సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరారు. కాగా ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి వైకాపా వారు ఓర్వలేరు… జీర్ణించుకోలేరు… అభినందించలేరని, అయితే రాష్ట్రానికి నష్టం కలిగించే పనులు మాత్రం చేయోద్దని సూచించారు.

తిరుపతి

వైభంగా కందాడ శ్రీ కామాక్షి సదా శివేశ్వర స్వామి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు

శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం కందాడ పంచాయతీ సదాశివేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం ముని రెడ్డి మరియు వనజ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి పసుపు అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.అనంతరం ఆలయ ధర్మకర్తలు ధనంజయ స్వామి,పండు స్వామి,నారాయణ స్వామి భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో దాము, మల్లికార్జున,విజయ్,బాలకృష్ణ చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నిర్మల్

*పల్లెల్లో మొదలైన స్థానిక సందడి*

నిర్మల్, (పున్నమి ప్రతినిధి టి సురేందర్ )* *పల్లెల్లో మొదలైన స్థానిక సందడి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు సమాయత్తమవుతున్నది తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం జడ్పిటిసి జడ్పీ చైర్ పర్సన్ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసింది దీంతో స్థానిక సమరం పై పల్లెల్లో ఆశావాహులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అంతేకాకుండా తమ బల ప్రదర్శనను చోటా నుంచి బడా నేతల వరకు తమ బలాన్ని నిరూపించుకుంటున్నారు నిర్మల్ జిల్లాలో మొత్తం జెడ్పిటిసి స్థానాలు 18 ఎంపీటీసీ స్థానాలు 157 జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 892 నిర్మల్ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 18 మొత్తం గ్రామపంచాయతీలు 400 మొత్తం వార్డుల సంఖ్య 3368 మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 3368 రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది ఇప్పటికే సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావాహులు వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయా పార్టీల ప్రముఖ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ బల ప్రదర్శనను నిరూపించుకుంటున్నారు గ్రామస్థాయిలో పేరు ఉన్న వారిని కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు గ్రామాల్లో ఎటు చూసినా స్థానిక ఎన్నికలపై చర్చ నడుస్తున్నది స్థానిక సమరంలో సర్పంచ్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవిగా ఆయా పార్టీల నేతలు కూడా పట్టు సాధిస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరిని పోటీ చేయించాలి . ఎవరిని ఉపసంహరించాలి గ్రామాలలో ఎవరికి పట్టుంది వారిని ఎలా మన వైపు తిప్పుకోవాలి అనే అంశాలపై నియోజకవర్గస్థాయిలో జిల్లా స్థాయిలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతా ఉంది ఇకపోతే ఎంపీటీసీ ఎన్నికలను కూడా ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి ఏది ఏమైనప్పటికిని జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పవచ్చు

నిర్మల్

వానల్ పహాడ్ గ్రామంలో విజయదుర్గమ్మ మహిమ – భక్తుల రద్దీ

నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గంలోని బైంసా మండలం వానల్ పహాడ్ గ్రామంలో గత సంవత్సరం చింతచెట్టులో వెలసిన విజయదుర్గమ్మ మహిమపై భక్తుల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గత సంవత్సరం అమ్మవారిని దర్శించుకున్న అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరినట్టు చెబుతున్నారు. ప్రత్యేకంగా, గత సంవత్సరం కట్టిన మూడు పూలను ఈ రోజు భక్తులు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు అమ్మవారి మహిమను గాఢంగా విశ్వసిస్తూ, మాత కరుణ అనుభవిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఈ పవిత్ర స్థలానికి పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పూజలు, వ్రతాలతో పాటు నిరంతరంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతుండటంతో వానపాడు గ్రామం భక్తుల ఆరాధన కేంద్రంగా మారింది. గ్రామస్థులు మాట్లాడుతూ – విజయదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. అమ్మవారి మహిమ దేశమంతటా వ్యాప్తి చెందాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా దసరా ఉత్సవం

శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడి వీధి నందు గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో దసరా ఉత్సవం విద్యార్థులు,మాతాజీలు కమిటీసభ్యుల అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.పిల్లలు, కోలాటం మరియు దుర్గ మాతా అమ్మవారి వేషధారణలతో,నృత్యాల తో అలరించారు.ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి పాఠశాలలో మన పండుగలు,సంప్రదాయాల గురించి అవగాహన కలిగించాలన్నారు.సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు సంస్కృతి,సంప్రదాయాలు,దేశభక్తి పట్ల పాఠశాల స్థాయి నుండి అహగాహన కలిగించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.