Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ బారినపడ్డారు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు

జాతీయ అంతర్జాతీయ

హెచ్‌-1బీ వీసా ఫీజుల వేళ.. రెండు అమెరికా కంపెనీల్లో భారతీయులకు సీఈఓ పదవి

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@ హెచ్‌1బీ వీసాల (H-1B Visa Fee ) ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు భారతీయుల పేర్లను ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్

బ్యాంక్‌ల చైర్మన్లు, MDలతో చంద్రబాబు సమావేశం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాలు పెట్టాలని ఆహ్వానం. ఏపీ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పిలుపు. ఏపీ కి వచ్చిన పెట్టుబడులను వివరించిన చంద్రబాబు. ఏపీ లో చేపట్టిన పోర్టులు,ఎయిర్‌పోర్టులు, హార్బర్లు,నేషనల్ హైవేలు,క్వాంటం వ్యాలీ పురోగతిపై ప్రజెంటేషన్.

భక్తి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ తిరుమల, 2025 సెప్టెంబర్ 23: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. విశిష్టత వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. సూర్యాస్తమయం తరువాతే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. అంకురార్పణ క్రమం విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీ శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ వరుదు కళ్యాణిని ఉద్దేశించి లోకేష్‌ వ్యాఖ్యలు సరికాదన్న బొత్స ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న మంత్రి లోకేష్ తాను మాట్లాడినప్పుడు బొత్స సభలో లేరన్న మంత్రి లోకేష్ మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా అంటూ లోకేష్ ఆగ్రహం మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం మేం కాదు: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్

ఆక్వా ఉత్పత్తుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం దిశ! – ప్రతిపక్షం దిశ!

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేపలు, రొయ్యలు తినే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారంలో కనీసం ఒక రోజు అయినా సీ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఆయన పేర్కొన్నారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్, పోషకాలు ఆక్వా ఉత్పత్తుల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రోటీన్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒక రోజు చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు. ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ స్పందన సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షం కూడా స్పందించింది. ఆక్వాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని వైఎస్ఆర్‌సీపీ నాయకులు హామీ ఇచ్చారు. తక్షణమే స్కూల్ మెనూలో చేపలు, రొయ్యలు చేర్చే అంశంపై వారు మద్దతు తెలిపారు. ఇక రైతుల ప్రయోజనాల దిశగా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆక్వాకు కరెంట్ సబ్సిడీ కొనసాగించాలని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి రైతులతో కలిసి ఫీడ్ ధరలను మానిటర్ చేయాలి అని అన్నారు. ఆక్వాపై రెండు దృక్కోణాలు ప్రభుత్వం దిశ : ప్రజారోగ్య పరంగా ఆక్వా వినియోగం పెంచే ప్రయత్నం. ప్రతిపక్షం దిశ: రైతు ప్రయోజనాల దిశగా సబ్సిడీలు, ఫీడ్ ధర నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీలు.

సినిమా

ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @సినిమా : రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జాతీయ ఉత్తమ నటులు షారూఖ్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ (12th ఫెయిల్‌) జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ సినిమా (హిందీ) ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌, స్టంట్‌ కొరియోగ్రఫీ హనుమాన్‌ సినిమా

ఆంధ్రప్రదేశ్

మెలియాయిడోసిస్‌’ వ్యాధి పై కింద తెలిపిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ తక్కువ రోగనిరోధక శక్తి, దీర్ఘకాలిక వ్యాధులుంటే సమస్యే – జ్వరం, దగ్గు, పుండ్లు కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించడం తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తురకపాలెంలో ‘మొలియాయిడోసిస్’ వ్యాధి వెలుగుచూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరాలు, పరీక్షలు నిర్వహించింది. అసలు మొలియాయిడోసిన్ వ్యాధి అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర వివరాలు తెలుసుకుందాం! మెలియాయిడోసిస్ అంటే : బర్ఖోల్డేరియా సూడోమల్లె అనే గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి నేరుగా సోకుదు. జంతువుల నుంచి మనుషులకు నేరుగా సోకడమనేదీ అరుదుగా జరుగుతుందంటున్నారు నిపుణులు. అయితే, కలుషితమైన నేల, నీటిలో ఈ బ్యాక్టీరియా సంవత్సరాల పాటు జీవించగలదని పేర్కొన్నారు. మెలియాయిడోసిస్ రుతుపవనాల ఆధారిత వ్యాధి. సుమారు 75-85 శాతం కేసులు వర్షాకాలంలో సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు చాలా విస్తృతంగా ఉంటాయని, ముఖ్యంగా ఊపిరితిత్తులు గట్టిపడటం, ఒక ప్రాంతంలో చీము గడ్డలు ఏర్పడటం నుంచి వేగంగా ప్రాణాంతకమయ్యే సెప్టిసిమియా (రక్తంలో ఇన్ఫెక్షన్) వరకు ఉండవచ్చని National Centre for Disease Control అధ్యయనంలో పేర్కొంది. ఈ వ్యాధి ఆగ్నేయ ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది. ఇది బయోటెర్రరిజం ఏజెంట్లలో కేటగిరీ B కింద వర్గీకరించబడిందని తెలిపింది. ఇందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదంటున్నారు నిపుణులు. వ్యాప్తికి అవకాశాలు : మెలియోయిడోసిస్ కలుషితమైన నేల, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని cdc.gov అధ్యయనంలో తేలింది. మేకలు, గొర్రెలు, పందులు వంటి వాటిలో ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. పశువులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, పక్షులు, గుర్రాలు, కంచర గాడిదలు, జింకలు, ఒంటెలు, సరీసృపాలు వంటి ఇతర ప్రభావిత జాతులు ఉన్నాయి. మెలియాయిడోసిస్ బారినపడిన జంతువులు, నేలపై, నీటిలో తిరిగితే, ఆ మట్టిని లేదా నీటిని మనుషులు తాకినప్పుడు లేదా శుద్ధి చేయకుండా తాగితే ఇన్ఫెక్ట్ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మనిషి శరీరంలో గాయాలున్నచోట నుంచి ఈ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుందంటున్నారు. ఈ వ్యాధి బారినపడితే సాధారణంగా కనిపించేది పల్మనరీ ఇన్‌ఫెక్షన్‌ ఒకటి. ఇది బ్రాంకైటిస్‌ లాగా తేలికపాటిది కావచ్చని లేదా న్యుమోనియాతో తీవ్రమైనదీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. clevelandclinic అధ్యయనం ప్రకారం, లక్షణాలు : దగ్గు శ్వాస ఆడకపోవడం ఛాతి నొప్పి అలసట జ్వరం ఆకలి లేకపోవడం తలనొప్పి విపరీతమైన అలసట పొత్తి కడుపు నొప్పి కీళ్ల నొప్పి గందరగోళం, దిక్కుతోచని స్థితి జంతువుల్లో మెలియాయిడోసిస్‌ను గుర్తించినట్లుగా పరిశోధనలు పెద్దగా లేవు. కానీ, ఇతర దేశాల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పందుల్లో మెలియాయిడోసిస్‌ వ్యాధి కారక బ్యాక్టీరియాను గుర్తించినట్టు నివేదికలు ఉన్నాయి. వర్షాలు పడ్డ తరువాత పర్యావరణ నమూనాలతో పాటు అనుమానిత జంతువులను పరీక్షించాలి. ఈ వ్యాధిని ఏదైనా జంతువుల్లో గుర్తించగలిగితే అవి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా సహాయపడుతుంది. దీంతో సరైన చర్యలు చేపట్టి మనుషులకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడొచ్చు. – ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.ఆనంద్‌కుమార్, పశువైద్య సూక్ష్మ జీవశాస్త్ర విభాగం, ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల, గన్నవరం, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు : కలుషితమైన నీటిని తాగకపోవటం. చర్మంపై గాయాలున్నప్పుడు మట్టి లేదా నీటికి దూరంగా ఉండటం. వర్షాకాలం, తుపాన్ల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండటం. స్థానికంగా చుట్టుపక్కల ఉండే పశుగణాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వాటికి పరీక్షలు చేయాలి. ర్యాండమ్‌ పరీక్షలతో స్పష్టత రావచ్చు. cdc.gov అధ్యయనం ప్రకారం, ఎవరిపై ఎక్కువ ప్రభావం : డయాబెటిస్ అధికంగా మద్యం వాడటం కాలేయ వ్యాధి కిడ్నీ వ్యాధి తలసేమియా (రక్త రుగ్మత) క్యాన్సర్, లేదా రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే మరొక పరిస్థితి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, సిస్టిక్ ఫైబ్రోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD), బ్రాంకియక్టాసిస్‌ నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

క్రైమ్

డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా ఒక సైబర్ మోసం. దీనిని ఎవరూ నమ్మవద్దు అని డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసం అంటే సైబర్ నేరగాళ్లు తాము పోలీస్‌ అధికారులు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది అన్నట్లుగా నటిస్తూ, మీపై కేసు ఉందని భయపెట్టడం, వీడియో కాల్ లో అరెస్ట్ చేస్తున్నాం అని చూపించడం, డబ్బులు బదిలీ చేస్తే తప్పించుకుంటారని మోసం చేయడం వంటి నేరాలు పెరుగుతున్న నేపద్యంలో ఇలాంటి నేరాలను నివారించడానికి ప్రజలు కు అవగాహన తప్పనిసరి అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్ కి కాల్ చేస్తే డబ్బు తిరిగి రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే నష్టపోవాల్సిందే అని తెలిపారు. డిజిటల్‌ అరెస్ట్‌ మోసాల పట్ల ప్రజలకు జిల్లా పోలీసుల సూచనలు: 1. ఎలాంటి ప్రభుత్వ శాఖలు లేదా పోలీసులు డబ్బులు అడగరు. 2. మీపై కేసులు ఉన్నాయన్న కారణంగా ఎవరైనా వీడియో కాల్ ద్వారా బెదిరిస్తే నమ్మకండి. 3. వెంటనే 1930 నెంబర్ (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా 100 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. 4. మోసపూరిత కాల్స్, మెసేజెస్, వాట్సాప్ వీడియో కాల్స్ కు స్పందించవద్దు. 5. ఈ రకమైన నేరాల నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సైబర్ సేఫ్టీ పై అవగాహన పెంపొందించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో డ్రెస్ కోడ్

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ: అసెంబ్లీ, శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నవరాత్రులు సందర్భంగా రోజుకో కలర్ డ్రెస్లో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నేడు గాయత్రి దేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ డ్రెస్ కోడ్లో సభకు వచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.