Monday, 4 May 2026

Blog

తిరుపతి

గిరిజనుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం:జనసేన నాయకులు పేట బ్రదర్స్

శ్రీకాళహస్తి:జనసేన పర్యటనలో భాగంగా పొయ్య ఎస్టీ కాలనీలోనీ చాలా మంది ప్రజలు ఆధార్ కార్డులు,రేషన్ కార్డులు లేకపోవడంతో మా పిల్లలను పాఠశాలకు పంపించాలి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా రేషన్ కార్డులు లేనందువలన బియ్యం తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో,ఈ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఎస్టీ కాలనీవాసులతో కిలిసి పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి జనసేన కార్యకర్తలు పొయ్య సచివాలయం దగ్గరకు వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.ఈ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని నమోదు చేసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

దుర్గమ్మ సేవలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

పున్నమి వార్త ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 24.09.2025. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే వసంతకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ మర్యాదలతో ఆయన్ని సాదరంగా స్వాగతించారు. వేదపండితులు ఆశీర్వదించి, అమ్మవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందజేశారు.

కాకినాడ

ఓజి సినిమా అఖండ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసిన డా. బి.ఎన్.రాజు

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల సందర్భంగా జనసేన నాయకుడు డా. బి.ఎన్.రాజు ఆధ్వర్యంలో సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ మహా పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయా క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బి.ఎన్.రాజు మాట్లాడుతూ జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా అఖండ విజయం సాధించి, నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అధిక లాభాలు తేవాలని, అభిమానులకు ఒక పండగ మాదిరిగా నెలకొల్పుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి

• పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ • అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్నీ గుర్తించాము మంగళగిరి : ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరచిన ఆందోళనలు, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం తాను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని, అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నామన్నారు. మత్స్యకారులు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించానని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సమస్యల పరిష్కారంతోపాటు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ దృష్టిపెడుతుంది. నష్ట పరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించడం జరిగిందని, మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బ తిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించానన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించానని, అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశానన్నారు. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురుచూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, తాను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో విద్యుత్ అదాలత్

25.09.2025 తేదీ గురువారం ఉదయం11.30 నుండి1.30 గంటల వరకు శ్రీకాళహస్తి పట్టణంలో ని ధర్మరాజుల గుడి వద్ద గల విద్యుత్ కార్యాలయము నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడునని,కావున ప్రతి ఒక్కరు తమ యొక్క పరిష్కారం కాని విద్యుత్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోగలరని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్న రెడ్డప్ప ప్రకటన విడుదల చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తి నియోజకవర్గం వైపు ఆ రెవెన్యూ అవినీతి

“అనకొండ” చూపు.. గత పాలనలో నియోజకవర్గంలోని రెండు మండలాల్లో తిష్ట రూ.300 కోట్లకు పైగా అక్రమంగా అర్జించినట్లు భారీ ఎత్తున ఆరోపణలు.. ప్రధాన పత్రికల్లోనూ సంచలన కథనాలు.. కూటమి పాలన రాక ఆ అవినీతి “అనకొండ” పై బదిలీ వేటు ..నేరుగా అనంతపురం కు బదిలీ.. అక్కడనుండి నాయకులను ప్రసన్నం చేసుకొని సరాసరి మళ్లీ చిత్తూరుకు.. అక్కడనుండి నేరుగా ప్రస్తుతం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పోస్టింగ్.. మళ్లీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఓ మండలానికి అధికారిగా వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు.. నాటి ఈ అధికారి చేసిన అవినీతి ఫ్రీ హోల్డ్ భూములపై అవకతవకలు, అక్రమాలపై విచారణ చే పట్టకపోవడంపై తీవ్ర విమర్శలు..!*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైస్సార్ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ గా చెట్ల రామారావు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ గా నియమితులు అయిన చెట్ల రామారావు ఈరోజు డా.బి .ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గీరెడ్డి ని మర్యాదపూర్వకంగా వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి జగన్ అన్న పార్టీ ఆవిర్భావం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పనిని వారికి తెలియడం జరిగింది.

జాతీయ అంతర్జాతీయ

పదో తరగతి పాసైన వారికి భారీగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 7,565 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 22 నుంచి అన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. పోస్టుల వివరాలు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల సంఖ్య పురుషులు : 4,408 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల సంఖ్య మహిళలు : 2,496 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఎక్స్-సర్వీస్‌మెన్ పోస్టుల సంఖ్య (పురుషులు) (ఇతరులు): 285 కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)ఎక్స్-సర్వీస్‌మెన్ పోస్టుల సంఖ్య (పురుషులు) (కమాండో): 376 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు/కుమార్తెలు, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ తదితరులకు అర్హతలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు తప్పనిసరిగా పీఈ అండ్‌ ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.10.2025. దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 22.10.2025. దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్‌ 29 నుంచి 31 వరకు.

జాతీయ అంతర్జాతీయ

ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు?

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్ ముగ్గురు వాదన మొదలుపెట్టారు. ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అమెరికానా? రష్యానా? లేక చైనానా?” ఎంత వాదించినా తేలలేదు. అప్పుడు వారు మోదీజీని అడిగారు: “ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు”? ఒక భారతీయుడు మెల్లగా బదులిచ్చాడు నాకు తెలిసిందల్లా ఇది మాత్రమే 1. గూగుల్ సీఈఓ – ఒక భారతీయుడు. 2. మైక్రోసాఫ్ట్ సీఈఓ – భారతీయుడు 3. సిటిగ్రూప్ సీఈఓ – భారతీయుడు 4. సాఫ్టబాంక్ విషన్ ఫండ్ సీఈఓ – భారతీయుడు 5. Adobe CEO – భారతీయుడు 6. NetApp CEO – భారతీయుడు 7. PepsiCo CEO – భారతీయుడు 8. నోకియా సీఈఓ – భారతీయుడు 9. MastarCard CEO – భారతీయుడు 10. DBS CEO – భారతీయుడు 11. Cognizant CEO – భారతీయుడు 12. Novartis CEO – భారతీయుడు 13. Conduent CEO – భారతీయుడు 14. Diageo CEO – భారతీయుడు 15. SanDisk CEO – భారతీయుడు 16. Motorola CEO – భారతీయుడు 17. Harman CEO – భారతీయుడు 18. Micron CEO – భారతీయుడు 19. Palo Alto Networks CEO – భారతీయుడు 20. Reckitt Benckiser CEO – భారతీయుడు 21. ఇప్పుడు IBM CEO కూడా భారతీయ వంశస్థుడే 22. బ్రిటన్ ఛాన్సలర్ – భారతీయుడు 23. బ్రిటన్ హోమ్ సెక్రటరీ – భారతీయుడు 24. ఐర్లాండ్ ప్రధాన మంత్రి – భారతీయుడు ఇప్పుడు చెప్పండి… ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? చాలా ఆసక్తికరమైంది! కదా భారతీయుడిగా గర్వించండి– భారతీయులమని గర్వంగా చెప్పుకోండి.

నిర్మల్

“శుభోదయం బ్రేకింగ్ న్యూస్: కొత్త రోజు కొత్త ఆశలతో ఉదయించింది – విజయమే మీ గమ్యం!”

నిర్మల్ జిల్లా బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, ఎండలు మారుతూ ఉన్నప్పటికీ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉదయాన్నే గ్రౌండ్లలో వాకింగ్ చేయడానికి హాజరవుతున్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న పలువురు వ్యక్తులు వైద్యుల సూచన మేరకు నిత్యం వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వర్షం పడుతున్నా, ఎండ మండుతున్నా వాకింగ్‌ను ఆపకుండా కొనసాగించడం గమనార్హం. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదాన్ని నమ్మిన ప్రజలు క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఇతరులకు కూడా ప్రేరణనిస్తున్నారు. ప్రజలు చెబుతున్నట్లుగా, చిన్న వ్యాధులను జయించడానికి క్రమమైన నడక, ఆహారపు అలవాట్లు, సానుకూల ఆలోచనలే ప్రధాన ఆయుధమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.